బిగ్ బాస్ 2: సామాన్యుడు కాదు సెల‌బ్రిటీ ఔట్‌

బిగ్ బాస్ 2:  సామాన్యుడు కాదు సెల‌బ్రిటీ ఔట్‌

ఏమైనా జ‌ర‌గొచ్చన్న ట్యాగ్ లైన్ తో బిగ్‌బాస్ సీజ‌న్ 2 షురూ చేయ‌టం తెలిసిందే. వ‌రుస వారాల్లో సెల‌బ్రిటీల్ని వ‌దిలేసి.. సామాన్యుల‌పై క‌త్తి క‌ట్టిన‌ట్లుగా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న బిగ్ బాస్‌.. ఈసారి సెల‌బ్రిటీపై వేటు వేశారు. అస‌లైన ఆట ఇప్పుడే మొద‌లైన‌ట్లుగా సంకేతాల్ని ఇచ్చారు. వ‌రుస వారాల్లో సామాన్య కంటెస్టెంట్ల‌పై వేటు వేయ‌టం ద్వారా.. సామాన్యుల‌కు బిగ్‌బాస్ 2లో కొన‌సాగే అవ‌కాశాన్ని ఇవ్వ‌టం లేద‌ని ఒక‌సారి.. సెల‌బ్రిటీలంతా ఒక‌టై.. సామాన్యుల్ని టార్గెట్ చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల్ని ఎదుర్కోవ‌టం తెలిసిందే.

ఈ వారం ఎలిమినేష‌న్ ఎదుర్కొంటున్న వారిలో సామాన్యుడైన గ‌ణేష్ ను వ‌దిలేసి.. సెల‌బ్రిటీ అయిన కిరిటీ దామ‌రాజునుఎలిమినేట్ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. వ‌రుస వారాల్లో సామాన్యుల‌పై వేటు ప‌డ‌టంపై జ‌నాగ్ర‌హం వ్య‌క్త‌మైంది. సోష‌ల్ మీడియాలోనూ విమ‌ర్శ‌ల ప‌రంప‌ర కొన‌సాగింది. ఈ నేప‌థ్యంలో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఏకైక సామాన్యుడు గ‌ణేష్ పై వేటు ప‌డ‌ద‌నే ప‌లువురు ఊహించారు.

ఇందుకు త‌గ్గ‌ట్లే.. ఆయ‌న సేఫ్ అయ్యారు. కొంద‌రి లెక్క‌ల‌కు త‌గ్గ‌ట్లు కిరిటీ బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. మొన్న‌టి వ‌ర‌కూ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సామాన్యుల‌కు సెల‌బ్రిటీ ఇమేజ్ లేక‌పోవ‌టం పెద్ద శాపంగా ఉండేది. వ‌రుస వారాల్లో సామాన్యులు ఎలిమినేష‌న్ కావ‌టంతో.. ప్ర‌తి సామాన్యుడు త‌న ప్ర‌తినిధిగా గ‌ణేష్ హౌస్ లో ఉండాల‌న్న ఆరాటం అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఇది.. గ‌ణేష్ కు క‌లిసి వ‌చ్చే అంశంగా చెబుతున్నారు.

స‌మీప దూరంలో గ‌ణేష్ ఎలిమినేట్ అయ్యే అవ‌కాశం ఉండ‌ద‌న్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ వారం ఎలిమినేట్ అయిన కిరిటీ విష‌యానికి వ‌స్తే.. అదంతా ఆయ‌న చేతులారా చేసుకున్న‌ద‌న్న మాట చెప్ప‌క త‌ప్ప‌దు.

హౌస్ లో ఉన్నంత‌వ‌ర‌కూ గొడ‌వ‌లు ప‌డ‌టం.. గొడ‌వ‌లు పెడుతూ త‌న గొయ్యి తానే త‌వ్వుకున్న కిరిటీకి.. ఈవారం బిగ్ బాస్ హౌస్ నుంచి వీడ్కోలు ప‌లికారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు