ఆ హీరోకి బ్యాడ్‌ రివ్యూస్‌ భయం

ఆ హీరోకి బ్యాడ్‌ రివ్యూస్‌ భయం

సాయి ధరమ్‌ తేజ్‌కి తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్‌ వుంది కానీ బయట మాత్రం అస్సలు వసూళ్లు వుండవు. ఓవర్సీస్‌లో అతని హిట్‌ సినిమాలు కూడా ఎప్పుడూ సరైన వసూళ్లు తెచ్చుకోలేదు. దీనికి కారణం అతని హిట్‌ చిత్రాలకి కూడా సరైన రేటింగ్స్‌ రాకపోవడమే అనవచ్చు. ఇటీవల తన లోకల్‌ మార్కెట్‌ కూడా బాగా పడిపోవడంతో 'తేజ్‌' చిత్రంతో ఎలాగైనా తిరిగి ఫామ్‌లోకి రావాలని సాయి ధరమ్‌ తేజ్‌ కలలు కంటున్నాడు.

ఈ చిత్రం పబ్లిసిటీ కోసం ఊళ్లు పట్టుకుని తిరుగుతోన్న తేజ్‌కి దీనికి మెయిన్‌ స్ట్రీమ్‌ క్రిటిక్స్‌ నుంచి ఎలాంటి స్పందన వస్తుందోననే భయం పట్టుకున్నట్టుంది. అందుకే సినిమాలకి రివ్యూలు రాసే తన స్నేహితుడికి ప్రచారం మొదలు పెట్టాడు. అతను జెన్యూన్‌ రివ్యూలు రాస్తాడని, అతడినే ఫాలో అవమని తన ట్విట్టర్‌ ఫాలోవర్స్‌కి కూడా తేజ్‌ రికమండ్‌ చేసాడు. మెయిన్‌ స్ట్రీమ్‌ క్రిటిక్స్‌ ఎలాంటి రివ్యూలు, ఎంత రేటింగులు ఇస్తారనేది తన చేతుల్లో లేదు కనుక స్నేహితుడికి ప్రమోషన్‌ చేస్తున్నట్టున్నాడు.

మిగతా టైమ్‌లో అతను ఈ ప్రమోషన్లు చేపట్టినా బాగుంటుంది కానీ మరి కొద్ది రోజుల్లో తన సినిమా రిలీజ్‌ పెట్టుకుని ఈ డప్పు వేయడమే బాలేదు. అయినా ఇండివిడ్యువల్‌గా ట్విట్టర్‌లో రిపోర్టులు ఇచ్చేవారి కంటే వెబ్‌సైట్లు పెట్టి రెప్యుటేషన్‌ కోసం పాకులాడే వారిచ్చే రేటింగులకే విలువ ఎక్కువ తేజ్‌. మీ స్నేహితుడి వ్యూస్‌తో రెగ్యులర్‌ క్రిటిక్స్‌ వ్యూస్‌ మ్యాచ్‌ అవుతాయనే ఆశిద్దాం మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English