బాలయ్యకి, వీళ్ళకీ ఎలా కుదురుతుంది?

బాలయ్యకి, వీళ్ళకీ ఎలా కుదురుతుంది?

ఎన్టీఆర్‌ బయోపిక్‌ రూపొందించే విషయంలో మహానటి రిలీజ్‌ తర్వాత చాలా మార్పులు వచ్చాయి. అంతకుముందు ఈ చిత్రం ఫలానా విధంగా వుండాలనే ఐడియా బాలయ్యకి, నిర్మాతలకి వుంది. కానీ మహానటి రిలీజ్‌ తర్వాత బయోపిక్‌ రూపకల్పనపై ఆలోచన మారింది. అంతకుముందు బాలయ్య మాత్రం వుంటే చాలని అనుకున్నవారే ఇప్పుడు ఇతర తారాగణం కూడా బలంగా వుండాలని డిసైడ్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో మహానటిలో పలు పాత్రలు పోషించిన నటీనటుల్ని ఎన్టీఆర్‌ బయోపిక్‌కి కన్సిడర్‌ చేస్తున్నారనే టాక్‌ మొదలైంది.

ఉదాహరణకి అక్కినేని నాగేశ్వరరావు పాత్రని నాగచైతన్యతో, సావిత్రి పాత్రని కీర్తి సురేష్‌తో చేయించాలని భావిస్తున్నారని అంటున్నారు. ఈ ఆలోచన మంచిదే కానీ ఇక్కడ ఎన్టీఆర్‌ పాత్ర చేస్తున్నది ఎవరు అనేది కూడా గుర్తుంచుకోవాలి. ఎన్టీఆర్‌గా బాలకృష్ణ నటిస్తున్నపుడు మిగతా తారాగణం యువకులు అయితే ఎలా కుదురుతుంది? మహానటి అంటే అందరూ యువ తారాగణంతోనే చేసారు కానీ ఎన్టీఆర్‌ బయోపిక్‌ అలా కాదుగా? మరి యంగ్‌ ఎన్టీఆర్‌గా బాలయ్య కాకుండా మరెవరైనా నటుడు కనిపిస్తాడా? దానికి బాలకృష్ణ అంగీకరిస్తాడా? ఒకవేళ అంగీకరించినా ఎంత భాగం మరో నటుడికి అవకాశమిస్తారు? లేక ఇదంతా మీడియా అత్యుత్సాహమే తప్ప దర్శకుడు క్రిష్‌ ఆలోచన కాదంటారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు