అల్లు అర్జున్‌తో ఫ్లాపయి ఆ హీరో దగ్గరకి

అల్లు అర్జున్‌తో ఫ్లాపయి ఆ హీరో దగ్గరకి

ఎన్టీఆర్‌ తనని వెయిట్‌ చేయించి, చేయించి సినిమా ఇవ్వలేదని సరాసరి అల్లు అర్జున్‌ దగ్గరకెళ్లి కథ ఓకే చేయించుకున్న వక్కంతం వంశీ పంతం నెగ్గించుకోలేకపోయాడు. ఎన్టీఆర్‌ ఏమి మిస్‌ అయ్యాడోనని ఫీలవ్వాల్సిన అవసరం లేకుండా 'నా పేరు సూర్య'తో విఫలమయ్యాడు.

అల్లు అర్జున్‌ లాంటి మినిమం గ్యారెంటీ హీరోతో మంచి సీజన్లో వచ్చినా విజయం సాధించలేకపోయిన వక్కంతం వంశీకి ఇప్పుడు రవితేజ అవకాశమిస్తున్నాడని సమాచారం. కిక్‌తో రైటర్‌గా రవితేజకి బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన వంశీ 'కిక్‌ 2'తో డిజాస్టర్‌ ఇచ్చాడు. అయినా కానీ వంశీ సామర్ధ్యంపై రవితేజకి నమ్మకం ఎక్కువే. దర్శకుడిగా అతని రెండవ చిత్రం తానే చేస్తానని రవితేజ ఎప్పుడో మాట ఇచ్చాడు. ఇప్పుడు తన తొలి సినిమా ఫ్లాప్‌ అయినా కానీ రవితేజ ఆ మాట నిలబెట్టుకుంటున్నాడు. అయితే ఈ చిత్రం కోసం వక్కంతం వంశీ చాలా కాలంపాటు వేచి చూడక తప్పదు.

ప్రస్తుతం రవితేజకి 'అమర్‌ అక్బర్‌ ఆంటోని', 'తెరి' రీమేక్‌తో పాటు వి.ఐ. ఆనంద్‌ దర్శకత్వంలో మరో చిత్రం వరుసలో వున్నాయి. ఇవన్నీ పూర్తయితే తప్ప వంశీకి రవితేజ డేట్లు దొరకవు. టచ్‌ చేసి చూడు, నేల టిక్కెట్టుతో రవితేజ మార్కెట్‌ బాగా పడిపోయింది. మరి ఈ రాబోయే చిత్రాల ఫలితాలని బట్టి వంశీ సినిమా వుంటుందా లేదా అనేది డిసైడ్‌ అవుతుంది. ప్రస్తుతానికి అయితే అతని కోసం కథ రెడీ చేసే పనిలో వక్కంతం బిజీగా వున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు