ఆ హీరోయిన్‌ నాని రికమండేషన్‌ క్యాండిడేటా?

ఆ హీరోయిన్‌ నాని రికమండేషన్‌ క్యాండిడేటా?

బిగ్‌బాస్‌ షోకి హోస్టింగ్‌ చేయడమనేది పిల్లలాట కాదని నానికి తెలిసి వచ్చే వుంటుంది. హీరోగా అందరివాడు అనిపించుకున్నవాడే ఇప్పుడు బిగ్‌ బాస్‌ హోస్ట్‌గా అందరితో అక్షింతలు వేయించుకుంటున్నాడు. ఎన్టీఆర్‌ మాదిరిగా సూపర్‌స్టార్‌డమ్‌ లేకపోవడంతో పాటు కంటెస్టెంట్లలో పలువురితో స్నేహ సంబంధాలు వుండడంతో నానిని వారు అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు. దీనికి తోడు కొందరు కంటెస్టెంట్ల విషయంలో నాని చూసీ చూడనట్టు వ్యవహరించడం కూడా నెగెటివిటీకి కారణమవుతోంది.

ముఖ్యంగా తేజస్వి మదివాడతో నాని వ్యవహరిస్తోన్న తీరు విమర్శలకి తావిస్తోంది. హౌస్‌లో పలు కాంట్రవర్సీలకి కారణమవుతూ, అందరు కంటెస్టెంట్లని తన శాడిజంతో ఏడిపిస్తోన్న తేజస్విని ఇంతవరకు నాని మందలించలేదు. ప్రతి వారం నాని ఆమెకి క్లాస్‌ తీస్తాడని ప్రేక్షకులు ఎదురు చూస్తూ వుంటే నాని మాత్రం ఆమెతో జోకులేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. దీంతో నాని పట్ల తీవ్ర వ్యతిరేకత సోషల్‌ మీడియాలో స్టార్ట్‌ అయింది. ఒక్కసారి అతని అకౌంట్‌ని మెన్షన్‌ చేసిన ట్వీట్లు చూస్తే ఏ స్థాయిలో విరుచుకుపడుతున్నారనేది అర్థమవుతుంది.

దీనికి తోడు కొత్తగా నాని రికమండేషన్‌ చేసిన క్యాండిడేట్లలో తేజస్వి వున్నదనే ప్రచారం స్టార్ట్‌ అయింది. శ్రీరెడ్డిని ఈ షోకి రాకుండా చేసాడనే ఆరోపణ ఆల్రెడీ వుంది. తనపై వస్తోన్న ఆరోపణలకి సమాధానం ఇవ్వడానికి నాని వచ్చే వారం అయినా ట్రై చేస్తాడో లేదో కానీ నటుడిగా తనకి వున్న యూనివర్సల్‌ అప్పీల్‌ మాత్రం ఈ షో వల్ల కాస్త ప్రమాదంలో పడుతోందనే మాట వాస్తవం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English