చెల్లించక తప్పదు భారీ మూల్యం!

చెల్లించక తప్పదు భారీ మూల్యం!

'ఈ నగరానికి ఏమైంది?' అనే క్యాచీ టైటిల్‌తో కామెడీ సినిమా తీసిన పెళ్లిచూపులు దర్శకుడికి ఈసారి ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువ వచ్చాయి. మొదటి సినిమాకి యునానిమస్‌ పాజిటివ్‌ రివ్యూలు రాగా, రెండవ చిత్రానికి విమర్శలు రావడం, దానికి తోడు కలక్షన్లు లేకపోవడంతో యువకుడైన తరుణ్‌ భాస్కర్‌కి కోపమొచ్చింది.

లోపం తన సినిమాలో లేదని, విమర్శకులలో వుందని తేల్చేసాడు. తటస్థుల నుంచి తనకి సపోర్ట్‌ వస్తుందని భావించి విమర్శకుల అర్హతలని ప్రశ్నించాడు. కానీ అందరూ మూకుమ్మడిగా తననే తప్పుబట్టారు. వారు పొగిడినపుడు అవసరం లేని అర్హతలు విమర్శిస్తే అవసరం వచ్చిందా అని నిలదీసారు. ఈ స్పందన ఊహించని తరుణ్‌ ఇప్పుడు తన సోషల్‌ మీడియా అకౌంట్లు డిలీట్‌ చేసుకున్నాడు.

ఒక క్రియేటర్‌ మరీ ఇంత సెన్సిటివ్‌గా వుంటే ఎలా కుదురుతుంది? క్రియేటివ్‌ ఫీల్డులో ఫెయిల్యూర్స్‌ మామూలే. విమర్శలూ మామూలే. మరి తన సినిమా బాలేదని చెప్పేవారికి అర్హతలు వుండాలని అంటున్నాడంటే అతను ప్రేక్షకులకీ చెబుతున్నది అదేగా? ఎదుగుతోన్న దశలో క్రియేటర్లకి ఇలాంటి ఆవేశాలుంటే లేని పోని ప్రెజర్‌ని క్యారీ చేయాల్సి వస్తుంది. అది తన వర్క్‌ని కూడా ఎఫెక్ట్‌ చేసే అవకాశముందని అతని హితులు, అభిమానులు ఫీలౌతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు