ప‌ర్స‌న‌ల్స్ చెప్పేసిన ప్ర‌ముఖ న‌టి!

ప‌ర్స‌న‌ల్స్ చెప్పేసిన ప్ర‌ముఖ న‌టి!

బాలీవుడ్‌లో చాలామంది న‌టీమ‌ణులు ఉన్నా.. మిగిలిన వారికున్న భిన్న‌మైన ఇమేజ్ ట‌బు సొంతం. మొద‌ట్లో గ్లామ‌ర్ పాత్ర‌ల్ని పోషించిన ఆమె.. త‌ర్వాతి కాలంలో ఆమె న‌ట‌న అంద‌రిని ఫిదా అయ్యేలా చేసింద‌ని చెప్పాలి. వ‌య‌సు మీద ప‌డుతున్నా.. ఇప్ప‌టికి ఆమె అందం చెక్కు చెద‌ర్లేద‌ని చెప్పాలి.

వ‌య‌సుతో పాటు.. ఆమె అందంలోనూ ప‌రిప‌క్వ‌త కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంద‌ని చెప్పాలి. తాజాగా విడుద‌లైన సంజు మూవీలో కీల‌క‌పాత్ర పోషించారు. ఇదిలా ఉండ‌గా తాజాగా ఒక కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా హాజ‌రైన ట‌బును ఇంట‌ర్వ్యూ చేశారు.

ఇందులో ఆమె వ్య‌క్తిగ‌త విష‌యాల మీద ప‌లు ప్ర‌శ్న‌ల్ని సంధించారు. పెళ్లికి సంబంధించిన ఆమె కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తానిప్ప‌టికి సింగిల్ గా ఉన్న‌ట్లు చెప్పిన ఆమె.. ఒంట‌రి జీవితాన్ని తాను ఎంజాయ్ చేస్తున్న‌ట్లు చెప్పారు. త‌న జీవితంలో ప్ర‌తి క్ష‌ణాన్ని అస్వాదించిన‌ట్లుగా చెప్పారు.

పెళ్లి జీవితం బాగుంటుందా? అంటే త‌న‌కు తెలీద‌నే చెబుతాన‌ని.. ఎందుకంటే తానిప్ప‌టి వ‌ర‌కూ ఒక్క‌సారిగా పెళ్లి చేసుకోలేద‌న్నారు. పెళ్లి చేసుకోలేద‌న్న బాధ త‌న‌కు లేద‌ని.. త‌న పెళ్లికి సంబంధించి అడిగే ప్ర‌శ్న‌ల‌కు త‌న ద‌గ్గ‌ర స‌మాధానం లేద‌న్నారు. పెళ్లి మీద ఈ మ‌ధ్య కాలంలో ట‌బు ఇంత ఓపెన్ గా కామెంట్స్ చేయ‌టం ఇదే తొలిసారి. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఆమె తాను న‌టించిన చీనీక‌మ్ మూవీలో న‌టించిన‌ట్లుగా త‌న జీవితంలో అలాంటి ప్రేమ చోటు చేసుకోలేద‌న్నారు.

ఆ సినిమాలో 64 ఏళ్ల వ్య‌క్తిని 34 ఏళ్ల ట‌బు పాత్ర ప్రేమిస్తుంది. అలాంటి ప్రేమ త‌న జీవితంలో చోటు చేసుకోలేదు కానీ.. త‌న పాత్ర‌..త‌న రియ‌ల్ జీవితానికి ద‌గ్గ‌ర‌గా ఉంటుంద‌ని చెప్పి మ‌రిన్ని సందేహాలు ముసిరేలా చేసింది. ఏమైనా.. పెళ్లి మీద ట‌బు వెల్ల‌డించిన విష‌యాలు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు