వక్కంతంకు ఆ హీరో ఛాన్స్?

వక్కంతంకు ఆ హీరో ఛాన్స్?

రచయితగా ప్రస్థానం మొదలుపెట్టి దర్శకులుగా మారిన వాళ్లు లెక్కలేనంతమంది ఉన్నారు టాలీవుడ్లో. గత పది పదిహేనేళ్లలో అయితే ఈ కోవలో పదుల సంఖ్యలో మెగా ఫోన్ పట్టారు. త్రివిక్రమ్ శ్రీనివాస్.. కొరటాల శివ లాంటి స్టార్ డైరెక్టర్లు రచన నుంచి దర్శకత్వంలోకి వచ్చిన వాళ్లే. రచయితగా వక్కంతం వంశీకి ఉన్న పేరు చూసి అతను కూడా ఈ జాబితాలో పెద్ద దర్శకుడైపోతాడని చాలామంది భావించారు.

ఐతే దర్శకుడిగా తొలి అవకాశం పెద్దదే అందుకున్నాడు కానీ.. ఆశించిన విజయం మాత్రం దక్కించుకోలేకోయాడు వంశీ. దర్శకుడిగా అతడి తొలి సినిమా ‘నా పేరు సూర్య’ అతడికి తీవ్ర నిరాశనే మిగిల్చింది. మంచి హైప్ అయితే తెచ్చుకుంది కానీ.. అంచనాల్ని అందుకోవడంలో ఆ సినిమా విఫలమైంది.

అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టన సినిమా ‘నా పేరు సూర్య’ నిలవడంతో వక్కంతంకు రెండో అవకాశం కష్టంగా మారిపోయింది. ఈ చిత్ర విడుదలకు ముందు తనకు రెండు మూడు పెద్ద కమిట్మెంట్లే ఉన్నట్లు వక్కంతం చెప్పాడు. కానీ రిలీజ్ తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇప్పటిదాకా వక్కంతం కొత్త సినిమాను ప్రకటించలేదు. ముందు హామీ ఇచ్చిన ఒకరిద్దరు హీరోలు వెనక్కి తగ్గినట్లు సమాచారం.

ఐతే గతంలో ఫ్లాప్ డైరెక్టర్లెందరికో లైఫ్ ఇచ్చిన మాస్ రాజా రవితేజ.. వక్కంతంకు కూడా ఒక అవకాశం ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ‘కిక్’కు కథ అందించింది వక్కంతమే. ఆ సంగతి కూడా దృష్టిలో ఉంచుకుని వక్కంతంతో సినిమా చేయడానికి మాస్ రాజా సిద్ధమైనట్లు చెబుతున్నారు. మరి ఇందులో నిజమెంతో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు