లిప్ లాక్.. ఆమెనెవరూ అడగలేదట

లిప్ లాక్.. ఆమెనెవరూ అడగలేదట

కొందరు హీరోయిన్లను చూడగానే చాలా ట్రెడిషనల్‌గా అనిపిస్తారు. అలాంటి వాళ్ల నుంచి ప్రేక్షకులు ఎక్స్‌పోజింగ్ ఆశించరు. దర్శకులు కూడా వాళ్లను ఆ కోణంలో చూడరు. గ్లామర్ ఒలకబోయాలని కోరుకోరు. మలయాళ కుట్టి కీర్తి సురేష్ ఈ కోవకే చెందుతుంది. ఆమెది ఎప్పుడూ ట్రెడిషనల్ లుక్కే. దీనికి తోడు కీర్తి నటించిన సినిమాలు కూడా అలాంటివే. మొదట్నుంచి సంప్రదాయబద్ధంగా కనిపించే పాత్రల్లోనే నటించింది కీర్తి. అందులోనూ ‘మహానటి’ లాంటి సినిమాలో నటించాక ఈ ట్రెడిషనల్ ఇమేజ్ మరింతగా పెరిగిపోయింది. మరి హీరోయిన్ అయ్యాక ఇన్నేళ్లలో ఎవ్వరూ మిమ్మల్ని ఎక్స్‌పోజింగ్ చేయమని అడగలేదా.. ముద్దు సీన్లు చేయమని ఎప్పుడూ డిమాండ్లు పెట్టలేదా అని అడిగితే.. అలాంటిది ఇంత వరకు జరగలేదని చెప్పేసింది కీర్తి.

‘‘ఇంతవరకూ నాకు ముద్దు సీన్లు చేయాల్సిన అవసరమే రాలేదు. నాకు స్వతహాగానే భయం ఎక్కువ. తెరపై రొమాన్స్‌ చేయాలంటే సిగ్గెక్కువ. అందుకే అలాంటి సన్నివేశాల్లో నటించలేను. అసలు నన్నెవరూ ముద్దు సన్నివేశాల్లో నటించమని అడగలేదు. నేను ఎంచుకునే కథలు కూడా అలాంటివే ఉంటున్నాయి. ఒకవేళ ఎవరైనా అడిగినా నేను చేయనని చెప్పేస్తా’’ అని కీర్తి చెప్పింది. కెరీర్ ఆరంభంలోనే స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది కాబట్టి తనకు నచ్చిన పాత్రలే ఎంచుకునే స్వాతంత్ర్యం కీర్తికి ఉంది. ‘మహానటి’ తర్వాత తెలుగులో మరో సినిమా ఒప్పుకోని కీర్తి.. తమిళంలో మాత్రం క్రేజీ ప్రాజెక్టుల్ని లైన్లో పెట్టింది. విక్రమ్ సరసన ‘సామి స్క్వేర్’తో పాటు విజయ్-మురుగదాస్ సినిమాలో.. సూర్య పక్కన మరో సినిమాలో ఆమె నటిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు