అంబానీ పెళ్లిలో ఆవిడ డ్యాన్స్ చూశారూ..

అంబానీ పెళ్లిలో ఆవిడ డ్యాన్స్ చూశారూ..

ఇండియాలోని టాప్ మోస్ట్ బిజినెస్ మేన్ అయిన ముఖేష్ అంబాని ఇంట పెళ్లి సందడి మొదలైంది. ముఖేష్ - నీతా అంబానిల తనయుడు ఆకాష్ పెళ్లి వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కూతురు శ్లోకాతో జరగనుంది. జూన్ 30న వీరి ఎంగేజ్ మెంట్ జరుగుతుంది. ఈ సందర్భంగా నీతా అంబానీ తాజాగా బాలీవుడ్ స్టార్లందరికీ ఓ బ్రహ్మాండమైన పార్టీ ఇచ్చింది.

ఈ పార్టీకి బాలీవుడ్ తారా లోకమంతా తరలివచ్చింది. షారుఖ్ ఖాన్ - ప్రియాంక చోప్రా - రణ్ బీర్ కపూర్ - ఆలియా భట్ తదితరులంతా ఈ పార్టీకి అటెండయ్యారు. ఈ సందర్భంగా ఆటాపాటాతో అంతా సందడి చేశారు. ఈ పార్టీలో అందరినీ ఆశ్చర్యపరిచింది నీతా అంబానీ ఓ పాటకు డ్యాన్స్ చేయడం. శుభారంభ్ అంటూ సాగే ఓ క్లాసికల్ సాంగ్ కు రెడ్ శారీలో నీతా డ్యాన్స్ చేసింది. సంప్రదాయబద్ధంగా ఉండేలా ఈ పాటకు డ్యాన్సర్లందరితో కలిసి డ్యాన్స్ గెస్టులందరినీ భలే మెప్పించేసింది. నీతా అంబానీ డ్యాన్స్ ఈ వీడియో నెట్ లో వైరల్ గా మారింది.

నీతా అంబానీ ముఖేష్ ను పెళ్లి చేసుకోకముందు బాలీవుడ్ లో హీరోయిన్ గా చేసింది. ముఖేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాక కూడా బాలీవుడ్ తో మంచి రిలేషన్ షిప్ మెయిన్ టెయిన్ చేస్తూ వచ్చింది. అందుకే అంబానీల ఇంట ఏ చిన్న ఫంక్షన్ అన్నా బాలీవుడ్ తారా లోకమంతా వచ్చివాలిపోతుంది. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు