షకలక అలా ఎందుకు చెప్పాడంటే

షకలక అలా ఎందుకు చెప్పాడంటే

కమెడియన్లు హీరోలుగా మారడమనేది ఎప్పటి నుంచో ఉన్న ట్రెండే. ఇప్పటికే హీరోలుగా మారిన వాళ్లు కెరీర్ ఎలా ముందుకు నడిపించాలో తెలియక కిందా మీదా పడుతున్న టైంలో జబర్దస్త్ కామెడీ షోతో పేరు తెచ్చుకున్న షకలక శంకర్ హీరోగా టర్న్ అయ్యాడు. అతడు నటించిన శంభోశంకర సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఈసినిమా ఆడియో ఫంక్షన్ లో షకలక శంకర్ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. శంభోశంకర స్టోరీ సిద్ధం చేసుకుని ఈ సినిమా నిర్మించాలంటూ తనకు తెలిసిన రవితేజ - దిల్ రాజు - త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్లందరినీ అడిగానని.. వాళ్లెవరూ ముందుకు రాలేదని చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్లు అతడిపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపించాయి. ఆ కామెంట్స్ ఎందుకు చేశాడో తాజాగా వివరణ ఇచ్చాడు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ హడావుడిగా చేయాల్సి వచ్చిందని.. దాంతో అనుకున్న గెస్టులెవరూ రాలేదని చెప్పాడు. తన సినిమాకు తనే గెస్ట్ కావడంతో సినిమా హైప్ తీసుకురావడానికి అసలు మూవీ మొదలెట్టడానికి ముందు ఏం జరిగిందో చెప్పుకొచ్చానన్నాడు.

ఆ రోజు ఫంక్షన్ లో తాను ఎవరి పేర్లయితే చెప్పానో వాళ్లందరూ తనతో మూవీ తీయడానికి సిద్ధమే అన్నారని... కాకపోతే వాళ్లందరూ వేరే కమిట్ మెంట్లతో బిజీగా ఉండటం వల్ల ఎప్పుడు తీస్తారో క్లారిటీగా చెప్పలేక పోయారని షకలక శంకర్ తెలిపాడు. తనను నమ్ముకున్న వాళ్లను దృష్టిలో పెట్టుకుని అంతవరకు ఆగలేక సినిమా శంభోశంకర కోసం వేరే నిర్మాతలతో మొదలు పెట్టేశానన్నాడు. మరీ ఇంత కంగారు అవసరమంటావా షకలక శంకరూ..

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు