కొట్టేశాడు.. ఐదో బ్లాక్ బస్టర్

కొట్టేశాడు.. ఐదో బ్లాక్ బస్టర్

చేసింది నాలుగు సినిమాలే. కానీ ఆ నాలుగు సినిమాలతోనే భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకడిగా పేరు సంపాదించాడు రాజ్ కుమార్ హిరాని. మున్నాబాయ్ ఎంబీబీఎస్.. లగేరహో మున్నాబాయ్.. 3 ఇడియట్స్.. పీకే.. ఇలా ఆయన తీసిన ప్రతి సినిమా ఒక క్లాసిక్కే. ఏ సినిమాకు ఆ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. దర్శకుడిగా హిరాని సినిమా సినిమాకూ ఎన్నో మెట్లు ఎక్కుతూ పోయాడు. తన సినిమాల ద్వారా ప్రేక్షకుల్లో ఆలోచన రేకెత్తించి గొప్ప పాఠాలు కూడా నేర్పిన హిరాని నుంచి సంజయ్ దత్ బయోపిక్ వస్తోందన్నపుడు అందరూ అనుమానంగా చూశారు. మంచి సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అనిపించుకున్న దర్శకుడు దత్ లాంటి బ్యాడ్ బాయ్ సినిమా తీయడమేంటి అన్నారు.

కానీ ఈ సినిమాతోనూ హిరాని తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఎలాంటి కథనైనా తనదైన శైలిలో ఆవిష్కరించగలిగే హిరాని.. ‘సంజు’విషయంలోనూ ప్రత్యేకత చాటుకున్నాడు. ఈ సినిమాకు కూడా అద్భుతమైన రివ్యూలొస్తున్నాయి. బాలీవుడ్లో ఈ ఏడాది ఇదే బెస్ట్ మూవీ అంటున్నారు. ఇండియాలో వచ్చిన బయోపిక్స్‌లోనూ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెబుతున్నారు. బాలీవుడ్ క్రిటిక్స్ అందరూ మినిమం 3.5తో మొదలుపెట్టి 4.5 వరకు రేటింగ్స్ ఇచ్చారు ఈ సినిమాకు. ఈ చిత్రం గురించి నెగెటివ్‌గా మాట్లాడేవాళ్లే కనిపించడం లేదు. సోషల్ మీడియా అంతా ఈ సినిమాపై ప్రశంసలతో హోరెత్తుతోంది. హిరాని దర్శకత్వ ప్రతిభను.. రణబీర్ నటనను అందరూ వేనోళ్ల పొగిడేస్తున్నారు. దీనికి ఓపెనింగ్స్ భారీ స్థాయిలో వచ్చేలా ఉన్నాయి. దక్షిణాది ప్రేక్షకులకు సైతం ఈ సినిమానే ఫస్ట్ ఛాయిస్ అవుతుండటం విశేషం. సందేహం లేదు.. హిరాని ఐదో బ్లాక్ బస్టర్ కొట్టేసినట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English