సినిమాల వరద.. ఒక్కదానిపైనే ఆశ

సినిమాల వరద.. ఒక్కదానిపైనే ఆశ

అన్ సీజన్లో పెద్ద సినిమాలు కొంచెం సైడ్ ఇచ్చాయంటే.. చిన్న సినిమాల వరద మొదలైపోతుంది. ఇప్పుడు అలాంటి సీజనే నడుస్తోంది. గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్ డల్లుగా నడుస్తోంది. ఈ శుక్రవారం ఏకంగా ఏడు సినిమాలు రిలీజవుతున్నాయి. కానీ పేరుకే ఇన్ని సినిమాలు వస్తున్నాయి కానీ.. వాటిలో జనాల దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా ఒక్క ‘ఈ నగరానికి ఏమైంది’ మాత్రమే.

సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థలో.. ‘పెళ్లిచూపులు’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్ రూపొందించిన చిత్రమిది. ఈ సినిమాపై యూత్‌లో మంచి అంచనాలే ఉన్నాయి. ఆసక్తికర ప్రోమోలతో సినిమాకు హైప్ తేవడంలో చిత్ర బృందం విజయవంతమైంది. ప్రి రిలీజ్ ప్రివ్యూలు.. స్పెషల్ షోకు మంచి రెస్పాన్సే వచ్చింది. పక్కాగా హిట్టవుతుందన్న అంచనాల మధ్య సినిమా రిలీజవుతోంది. ‘మహానటి’ తర్వాత సరైన విజయం లేని టాలీవుడ్లో ‘ఈ నగరానికి ఏమైంది’ కచ్చితంగా కరవు తీర్చే సినిమా అవుతుందని భావిస్తున్నారు.

ఇక శుక్రవారం షకలక శంకర్ హీరోగా పరిచయం అవుతున్న ‘శంభో శంకర’ కూడా రిలీజవుతోంది. దీనిపై అంచనాలు అంతంతమాత్రమే. ఇక అందరూ కొత్త వాళ్లు కలిసి చేసిన సాహసోపేత ప్రయత్నం ‘సంజీవని’ కూడా ఈ రోజే రిలీజవుతోంది. దాన్ని ప్రేక్షకులు ఏమాత్రం రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇంకా ‘కన్నుల్లో నీ రూపమే’.. ‘నా లవ్ స్టోరీ’.. ‘సూపర్ స్కెచ్’ లాంటి చిన్న సినిమాలు మూణ్నాలుగు వస్తున్నాయి. ఇవి ప్రేక్షకుల దృష్టిని ఏమాత్రం ఆకర్షిస్తాయో.. ఎలా మెప్పిస్తాయో చూడాలి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English