రేణు పెళ్లికి పవన్ వస్తాడా అనడిగితే..

రేణు పెళ్లికి పవన్ వస్తాడా అనడిగితే..

ఇటీవలే రెండో పెళ్లి కోసం నిశ్చితార్థం చేసుకుని.. ఆ సందర్భంగా పవన్ అభిమానుల హేట్ మెసేజులు తట్టుకోలేక ట్విట్టర్ విడిచిపెట్టి వెళ్లిపోయింది రేణు దేశాయ్. ఆమె తాజాగా ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో చిట్ చాట్ చేయడం విశేషం. ఈ సందర్భంగానే అనేక ఆసక్తికర ప్రశ్నలకు రేణు జవాబిచ్చింది.

మీ పెళ్లికి పవన్ కళ్యాణ్ వస్తాడా అని అడిగితే.. ఆమె ఇచ్చిన సమాధానం ఆసక్తి రేకెత్తించింది.  మీ హీరో సోషల్ మీడియాలా చాలా యాక్టివ్ గా ఉంటాడు కదా.. ఈ విషయం ఆయన్నే అడగండి అంది రేణు. మీరిలా పెళ్లి చేసుకుంటే అకీరా.. రేణుల భవిష్యత్తేంటి అని అడిగితే.. వాళ్లు చాలా సంతోషంగా ఉన్నారని.. వాళ్లకు చాలా పెద్ద ఫ్యామిలీ అండగా ఉందని.. కాబట్టి అభిమానులు వాళ్ల పిల్లల సంగతి చూసుకుంటే మంచిదని సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చింది రేణు.

రేణు చాట్ చేస్తుండగా ఆమె తనయుడు అకీరా లైన్లోకి వచ్చి ఆమెకు అభినందనలు చెప్పడం విశేషం. దానికి బదులుగా ‘థ్యాంక్ యు బేబీ.. యు ఆర్ మై లైఫ్’అని బదులిచ్చింది రేణు. పవన్ కళ్యాణ్ మళ్లీ మనం కలిసి ఉందాం అంటే తిరిగొస్తారా అని ఒక అభిమాని అడిగితే.. ఇలాంటి ప్రశ్నలు అడిగే వారికి భారతరత్న లేదా పద్మభూషణ్ ఇవ్వాలని రేణు అనడం విశేషం. ఇక అకీరా భవిష్యత్తులో సినిమాల్లోకి వస్తాడా అని అడిగితే.. ఇప్పటికైతే అతడికి అలాంటి ఆసక్తి ఏమీ లేదనేసింది రేణు. కెరీర్ ప్లాన్స్ గురించి ఎప్పుడు అడిగినా తాను నటుడు కావాలనుకోవట్లేదనే అకీరా చెబుతాడని అంది.

ప్రస్తుతం అకీరా తొమ్మిదో తరగతి చదువుతున్నాడని.. కొన్నేళ్ల తర్వాత కెరీర్ గురించి అతను నిర్ణయం తీసుకుంటాడని చెప్పింది. పవన్ తో తాను ఇకముందూ మంచి సంబంధాలే కొనసాగిస్తానని రేణు స్పష్టం చేసింది. అతను తన ఇద్దరు పిల్లలకు తండ్రి అని.. తన పిల్లలు ప్రతి సెలవుల్లోనూ తండ్రి దగ్గరికి వెళ్తారని.. తామిద్దరం వారి భవిష్యత్తు గురించి మాట్లాడుతుంటామని ఆమె చెప్పింది. పెళ్లి తర్వాత అకీరా మీతోనే ఉంటాడా అని అడిగితే.. పెళ్లవుతోంది తనకు కానీ.. తన కొడుక్కి కాదని.. అతను తనతోనే ఉంటాడని ఆమె స్పష్టం చేసింది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు