బాద్షా!! ఆ ఆనందం లేదు

బాద్షా!! ఆ ఆనందం లేదు

ఈ రోజు (మే 24)తో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కెరియర్‌లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'బాద్షా' సినిమా రిలీజయ్యి 50 రోజులు పూర్తవుతోంది. అసలు ఈ రోజుల్లో ఎంత పెద్ద హిట్టయినా రెండు  వారాలు ఆడి వెళ్ళిపోతున్నాయ్‌ కాబట్టి, ఈ సినిమా 50 రోజుల ఆడుతుందంటే పెద్ద విషయమే.

అయితే మొదటి రెండు వారాలు అబ్బురపరిచే కలెక్షన్లతో హడావుడి చేసిన బాద్షా, మూడో వారం నుండి దారుణంగా పడిపోయిన సంగతి తెలిసిందే. ఇక బాద్షా సినిమా 50 రోజులు పూర్తిచేసుకుందనే ఆనందం ఇటు నిర్మాత గణేష్‌లోకాని, అటు దర్శకుడు శ్రీను వైట్లలో కాని, లేకపోతే మన హీరో ఎన్టీఆర్‌లో కాని కనిపించడంలేదు. దీనికి కారణం ఏమైయుంటుందని ఆలోచిస్తే, పంపిణీదారులందరికీ సినిమాలో కనీసం 10 లక్షలైనా లాస్‌ వచ్చిందని, అందుకే యునిట్‌ వర్గాలు ఆనందంతో లేవని తెలుస్తోంది.

హీరోను ప్రక్కనపెట్టి ఎక్కువగా కామెడి చెయ్యటంవలన కలెక్షన్లు పడిపోయాయని కొందరంటే, అసలు 35 కోట్లలో తియ్యాల్సిన సినిమాను 55 కోట్లలో తీస్తే ఇలానే ఉంటుందని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా బాద్షా అభిమానులకు 50 రోజుల శుభాకాంక్షలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు