అక్కినేని పాత్రలో చెయ్ కాదు.. అతను?

అక్కినేని పాత్రలో చెయ్ కాదు.. అతను?

తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా తెలుగు రాజకీయాల్లో కూడా ఎంతో కీర్తిని అందుకున్న వ్యక్తి నందమూరి తారక రామారావు. అందుకే ఆయన బయోపిక్ ఎన్టీఆర్ చిత్రం కోసం ప్రస్తుతం తెలుగు ప్రజలు చాలా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందోగాని, సినిమా ఎలా వుంటుంది ఎవరి పాత్రల్లో ఎవరు కనిపిస్తారు అనే అంశాలు అందరిలో ఆసక్తిని రేపుతున్నాయి. రోజుకో రూమర్ అభిమానులను కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్నాయి.

ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఎన్టీఆర్ తో నటించిన సినీ తారలకు సంబంధించిన సన్నివేశాలు బయోపిక్ లో ఉంటాయి కాబట్టి వారి క్యారెక్టర్స్ కోసం కూడా నటీనటుల వెతుకులాట సాగుతోంది. ఆల్రెడీ చంద్రబాబుగా రానా.. అలాగే ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యా బాలన్ లు మెరవనున్న సంగతి తెలిసిందిఏ. అయితే అక్కినేని నాగేశ్వరరావు పాత్ర కోసం మొదట ఆయన మనవడు నాగ చైతన్య ని అనుకున్నారట. కాని ఇంకా అది ఫైనల్ కాలేదు. చైతు ఇటీవల మహానటి సినిమాలో ఏఎన్నర్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అందుకే అతని పేరు వినిపించింది. ఇదిగో ఇప్పుడు ఇందులో ట్విస్ట్ చూడండి.

ఏఎన్నర్ పాత్ర కోసం సుమంత్ అయితే బెటర్ అని క్రిష్‌ భావిస్తున్నాడట. నటుడిగా సుమంత్ కి మంచి గుర్తింపు ఎప్పుడో వచ్చింది. ఆయన తాత గారి పాత్రకు తప్పకుండా న్యాయం చేయగలరు అని దర్శకుడు క్రిష్ ఆలోచిస్తున్నట్లు టాక్. అయితే ఇంకా ఆ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. రేపటి నుండి క్రిష్‌ కొన్ని టెస్ట్ సీన్స్ తీయబోతుండగా.. వచ్చే నెల 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు