పవన్‌కళ్యాణ్‌ జపం దండగ

పవన్‌కళ్యాణ్‌ జపం దండగ

పవన్‌కళ్యాణ్‌ని పొగిడేస్తే అతని అభిమానులు సినిమా చూసేస్తారనే పిచ్చి భ్రమలో కొందరు వుంటున్నారు. పవన్‌ జపం చేస్తే యూట్యూబ్‌లో సదరు వీడియోకి లక్షల కొద్దీ వ్యూస్‌ వస్తాయేమో కానీ మేటర్‌ లేని సినిమాకి పవర్‌స్టార్‌ పేరు చెప్పుకున్నంత మాత్రాన కాసులు రాలవు. ఈ విషయం ఇటీవల వచ్చిన ఛల్‌ మోహన్‌ రంగ, నేల టిక్కెట్టు లాంటి చిత్రాలకే ప్రూవ్‌ అయింది.

పవన్‌ నామ స్మరణ వల్ల టికెట్లు కట్‌ అవ్వవని క్లియర్‌గా తెలుస్తున్నా కానీ తమ మాటల్ని జనం పట్టించుకోవాలనో, మీడియాలో కవరేజ్‌ బాగుంటుందనో లేక నిజంగానే కలక్షన్లు వస్తాయనో కొందరు అదే పనిగా పవన్‌ని వాడేస్తున్నారు. షకలక శంకర్‌ అయితే ఈ విషయంలో మిగతా వారికంటే నాలుగాకులు ఎక్కువే చదివేసాడు. పవన్‌ని ఇతను పొగిడినంతగా వేరెవరూ పొగిడి వుండరేమో.

అయితే అన్నిట్లోను అతి పనికి రాదని పెద్దలు అంటారు. పవన్‌ జపం చేసే విషయంలో హద్దులు దాటిపోతున్న శంకర్‌ని చూసి అభిమానులు కూడా లెక్క చేయడం లేదు. పవన్‌ ఫాన్సే అతడిని సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. పిచ్చి ఆకులు తినేసాడని, మతి భ్రమించిందని, తాగేసి మైకు పట్టుకుంటున్నాడని పలు విధాలుగా అతడిని కామెంట్‌ చేస్తున్నారు. రేపు రిలీజ్‌ అవుతోన్న ఈ సినిమాకి కనీస స్థాయి క్రేజ్‌ కూడా లేదంటే పవన్‌ జపం మొత్తం దండగ అయినట్టా కాదా మరి, మీరే చెప్పండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు