పెళ్లి చూపులు ట్యాగ్‌తో ఏమొస్తుంది?

పెళ్లి చూపులు ట్యాగ్‌తో ఏమొస్తుంది?

ప్రస్తుత ట్రెండ్‌లో ఏ దర్శకుడైనా, హీరో అయినా ఇప్పుడేమి చేసారనే దాని మీదే ప్రేక్షకులు దృష్టి పెడుతున్నారు. సదరు దర్శకుడు, హీరోకి స్టార్‌డమ్‌ వచ్చేస్తే తప్ప గత చిత్రాలని చూపించి సేల్‌ చేసుకోవడం జరగని పని. 'పెళ్లిచూపులు' దర్శకుడు తీసిన సినిమా అనే పేరుతో 'ఈ నగరానికి ఏమైంది?' చిత్రానికి విపరీతమైన క్రేజ్‌ వచ్చేస్తుందని భావించారు. అర్జున్‌ రెడ్డి తరహాలో యూత్‌ వెర్రెత్తిపోయి ఈ సినిమా కోసం ఎదురు చూస్తారని అంచనా వేసారు. కానీ రియాలిటీలో 'పెళ్లిచూపులు' ఎఫెక్ట్‌ ఏమీ కనిపించడం లేదు.

'మీ గ్యాంగ్‌తో రండి' అంటూ యూత్‌ని ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలించినట్టు లేవు. క్రేజ్‌ వున్న సినిమాకి అడ్వాన్స్‌ బుకింగ్‌ రూపంలోనే క్లియర్‌ పిక్చర్‌ వచ్చేస్తుంది. 'ఈ నగరానికి ఏమైంది' బుకింగ్స్‌ చూస్తే ప్రేక్షకుల్లో మొదటి షో చూసేయాలనే ఆసక్తి అయితే లేదని స్పష్టమవుతోంది. సినిమా రిలీజ్‌ అయి టాక్‌ వచ్చాక బాగుందని చెప్తే వసూళ్లు వస్తాయేమో కానీ అడ్వాన్స్‌గా బుకింగ్‌ చేసేసుకుని బ్లయిండ్‌గా తరుణ్‌ భాస్కర్‌ టాలెంట్‌ని నమ్మి ఎవరూ బారులు తీరడం లేదు.

ఈ చిత్రానికి విడుదలకి ముందు రోజు సాయంత్రం పెయిడ్‌ ప్రీవ్యూలు వేయాలని చూసారు కానీ క్రేజ్‌ లేదని అర్థమవడంతో ఆ ఆలోచన మానుకున్నారు. మరి ఈ నగరంలో ఏముందో, ఎంతుందో రేపు తెలిసిపోతుంది కనుక అందాక వేచి చూడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English