బిగ్‌బాస్‌ టైటిల్‌ కోసం తేజస్వి సెట్టింగ్‌

బిగ్‌బాస్‌ టైటిల్‌ కోసం తేజస్వి సెట్టింగ్‌

బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టింది లగాయతు కాంట్రవర్సీలతో అందరి నోట్లో నానుతోన్న తేజస్వి పెద్ద ప్లాన్‌తోనే బిగ్‌బాస్‌కి వెళ్లిందట. ఎలాగైనా టైటిల్‌ గెలిచి తీరాలనే లక్ష్యంతో వెళ్లిన తేజస్వి తన పేరు నామినేషన్లలోకి వచ్చిన ప్రతిసారీ భారీగా ఓట్లు పడేట్టు పెద్ద టీమ్‌ని అపాయింట్‌ చేసిందట. తన సోషల్‌ మీడియా అకౌంట్లని హ్యాండిల్‌ చేయడంతో పాటు తనకి ఓటింగ్‌ జరిగేలా క్యాంపైన్‌ చేయడానికి ఈ టీమ్‌ కృషి చేస్తుందని సమాచారం. ఇందుకోసం తేజస్వి భారీగానే ఖర్చు పెడుతోందని, ఖచ్చితంగా టైటిల్‌ గెలవడం లేదా కనీసం ఫైనలిస్టు అవడం లక్ష్యంగా తేజస్వి హౌస్‌లో అడుగు పెట్టిందని తెలిసింది.

ప్రతి వారం ఏదో ఒక కాంట్రవర్సీ లేపుతోన్న తేజస్వి వల్ల టీఆర్పీలు పెరగడంతో బిగ్‌బాస్‌ నిర్వాహకులు కూడా ఆమె పట్ల సాఫ్ట్‌గా వ్యవహరిస్తున్నారు. చివరకు హోస్ట్‌ నాని కూడా మిగతా వారిని మందలించినట్టుగా తేజస్విని ఏమీ అనడం లేదు. తాజాగా సామ్రాట్‌తో లవ్‌స్టోరీ లాంటిది స్టార్ట్‌ చేసి మాగ్జిమం స్క్రీన్‌ టైమ్‌ కొట్టేస్తోన్న తేజస్వి హౌస్‌లో అందరినీ మ్యానిప్యులేట్‌ చేస్తోన్న విధానం 'చెరుకురసం ఫ్యాక్టరీ' టాస్క్‌లో క్లియర్‌గా కనిపించింది. గత సీజన్‌లో ఇలాంటి మానిప్యులేటివ్‌ టాక్టిక్స్‌తోనే హరితేజ టైటిల్‌ కొట్టినంత పని చేసింది.

అలాగే సోషల్‌ మీడియా టీమ్‌ని వాడుకున్న ఆదర్శ్‌ కూడా గత సీజన్‌లో రన్నరప్‌ అయ్యాడు. దీనిని బట్టి చూస్తేనే తేజస్వి ఎంత హోమ్‌ వర్క్‌ చేసి వచ్చిందనేది అర్థమవుతోంది. మేథావిలా భావిస్తోన్న బాబు గోగినేని కూడా ఆమెకే సపోర్ట్‌ చేయడాన్ని బట్టే తేజస్వి మానిప్యులేషన్‌ ఏ స్థాయిలో వుందో తెలుస్తోంది. అన్నట్టు ఇలా టీమ్‌లని పెట్టుకుని రంగంలోకి దిగిన వారిలో తేజస్వి మాత్రమే కాక దీప్తి సునయన లాంటి వారు కూడా వున్నారు. ఏదేమైనా ఈసారి విజేత ఎవరవుతారనేది ఇంతవరకు క్లారిటీ రాకపోవడంతో ఈ షో ఒకింత ఆసక్తి రేకెత్తిస్తోన్న మాట వాస్తవం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English