రంగస్థలం తర్వాత మారిన గేమ్‌ ప్లాన్‌

రంగస్థలం తర్వాత మారిన గేమ్‌ ప్లాన్‌

వరుసగా మహేష్‌, తారక్‌, చరణ్‌లతో సినిమాలు నిర్మించి తక్కువ టైమ్‌లోనే టాలీవుడ్‌లో టాప్‌ ప్రొడక్షన్‌ హౌసెస్‌లో ఒకటిగా ఎదిగిన మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ పెద్ద సినిమాలకే కట్టుబడడం కరక్ట్‌ కాదని డిసైడ్‌ అయింది. పెద్ద హీరోలతో సినిమాలంటే ఏడాదికొకటి, రెండేళ్లకి ఒకటి మాత్రమే చేసే వీలుంటుంది. అందుకే ఈ సంస్థ గేమ్‌ ప్లాన్‌ మార్చింది.

మీడియం రేంజ్‌ హీరోల్లో చాలా మందికి అడ్వాన్సులిచ్చి వారితో వరుసగా సినిమాలు లాంఛ్‌ చేస్తోంది. రవితేజతో రెండు సినిమాలకి ఒప్పందం చేసుకున్న మైత్రి సంస్థ చైతన్య, అఖిల్‌ ఇద్దరికీ అడ్వాన్సులు ఇచ్చింది. విజయ్‌ దేవరకొండ, సాయి ధరమ్‌ తేజ్‌తో కూడా తలా ఒక సినిమా నిర్మించనుంది. వచ్చే యేడాదిలోగా ఈ చిత్రాలన్నీ సెట్స్‌ మీదకి వెళ్లిపోవడం లేదా పూర్తయిపోవడం జరుగుతుందట.

దిల్‌ రాజు తప్ప ప్రస్తుతం వేరే నిర్మాతలు ఎవరూ ఎక్కువ సినిమాలు తీయడం లేదు. టాప్‌ నిర్మాణ సంస్థలన్నీ నిర్మాణానికి దూరంగా వుండడంతో మైత్రి మూవీస్‌ వాళ్లు ఫ్యాక్టరీ తరహాలో ఏడాదికి నాలుగు సినిమాలైనా విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. డిజిటల్‌ రైట్స్‌, హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ రూపంలో ప్రస్తుతం మిడిల్‌ రేంజ్‌ సినిమాలు రిస్కు తక్కువ, లాభమెక్కువ అనిపించుకుంటున్నాయి. దీంతో భారీ చిత్రాలతోనే కాలక్షేపం చేయకుండా ఈ రేంజ్‌ సినిమాలపై మైత్రి సంస్థ కాన్సన్‌ట్రేట్‌ చేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు