ఆ విషయంలోనూ #బిగ్ బాస్2 అన్యాయమే

ఆ విషయంలోనూ #బిగ్ బాస్2 అన్యాయమే

బిగ్ బాస్ సీజన్ 1తో పోలిస్తే సీజన్-2ను ఇంట్రస్టింగ్ గా ఉండేలా చూసేందుకు నిర్వాహకులు గట్టిగానే కసరత్తు చేశారు. అందరూ సెలబ్రిటీలే కాకుండా ఈ సీజన్ లో ముగ్గురు కామన్ పీపుల్ కు అవకాశమిచ్చారు. ఓటింగ్ పరంగా వెనుకన ఉండటంతో వీళ్లలో ఇద్దరు ఇప్పటికే బయటకు వచ్చేశారు.

బిగ్ బాస్ షో కోసం స్టార్ మా డబ్బు ధారాళంగానే ఖర్చు చేస్తోంది. ఇందులో పార్టిసిపేట్ చేసేందుకు ఎంపిక చేసిన సెలబ్రిటీలకు భారీ మొత్తమే ఆఫర్ చేసినట్లు ముందు నుంచి టాక్ ఉంది. మరి అందులో పార్టిసిపేట్ చేసిన కామన్ పీపుల్ కు ఎంత మొత్తం అంది ఉంటుంది... బిగ్ బాస్ హౌస్ లో కొన్నాళ్లుండి షోలో కంటెస్ట్ చేసినందుకు గాను వాళ్లకు దక్కిన మొత్తం ఎంత అయి ఉంటుందని ప్రశ్న ఈ మధ్య తలెత్తింది. లేటెస్ట్ గా ఓ టీవీ షోలో షో నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన నూతన్ నాయుడు.. సంజన చెప్పిన మాటేమిటంటే తమకు అసలు డబ్బులే ఇవ్వలేదని.

బిగ్ బాస్ గురించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పి తనతో 29 పేజీల డాక్యుమెంట్ పై సంతకం తీసుకున్నారని.. దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ డిటైల్స్ కూడా తీసుకున్నారని నూతన్ నాయుడు చెప్పాడు. కానీ తనకు డబ్బులు అక్కర్లేదని ముందే చెప్పానని క్లారిటీ ఇచ్చాడు. సంజన కూడా షో కనిపిస్తే చాలనే వెళ్లానని చెప్పింది. ఇంతవరకు ఎలిమినేషన్ విషయంలోనే కామన్ మ్యాన్ కు అన్యాయం చేస్తున్నారని కామెంట్లు వస్తున్నాయి. రెమ్యునరేషన్ లోనూ అన్యాయమేనా? బిగ్ బాస్ ఏమిటీ న్యాయం?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు