ఆర్జీవీ దగ్గర పుట్టిన ఐడియా

ఆర్జీవీ దగ్గర పుట్టిన ఐడియా

ఈమధ్య కాలంలో ట్రయిలర్ తో సినిమాపై బోలెడు ఇంట్రస్ట్ క్రియేట్ చేసిన చిన్న సినిమా ఆర్ఎక్స్ 100. యమహా కంపెనీ బైకుల్లో బాగా క్లిక్కయిన మోడల్ ఆర్ఎక్స్100. ఓ బైక్ మోడల్ పేరుతో సినిమా తీసినా ఇదో ఎమోషనల్ డార్క్ లవ్ స్టోరీ. పల్లెటూరి ప్రేమలు.. పంతాలు సినిమాలో బాగానే కనిపించనున్నాయి.

ఆర్ఎక్స్ 100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఈ కుర్రాడు మిగతా అందరిలాగే సినిమాపై ఇష్టంతో హైదరాబాద్ వచ్చి నానా పాట్లు పడి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. చిన్నప్పటి నుంచి రామ్ గోపాల్ వర్మపై ఉన్న పిచ్చి అభిమానం కారణంగా ఓ ఫ్రెండ్ ద్వారా అతడిని కలుసుకోగలిగాడు. తరవాత ఆర్జీవీతో కలిసి అటాక్ - కిల్లింగ్ వీరప్పన్ - వంగవీటి సినిమాలకు పనిచేశాడు. ఆర్జీవీతో కలిసి పనిచేస్తున్నప్పుడే ఆర్ఎక్స్ 100 కథకు ఐడియా తట్టిందట.

ఆర్ఎక్స్ 100 కథ చాలామందికి వినిపించినా సినిమా చేయడానికి ముందుకు రాలేదని అంటున్నాడు అజయ్ భూపతి. కొత్త హీరో కార్తికేయ ఈ రోల్ కు సరిపోతాడని భావించడంతో అతడితోనే సినిమా తీశాడు. తాను పుట్టి పెరిగిన విలేజ్ లోనే ఈ సినిమా మేజర్ పార్ట్ పూర్తి చేశాడు. ‘‘నేను హిందీ సినిమాలు - ఇంగ్లిష్ సినిమాలు చూసి డైరెక్టర్ ను అవలేదు. నా చుట్టుపక్కల మనుషులు.. పరిస్థితులను బాగా చూశా. అలాంటి కథ చాలా సహజంగా ఉంటుందని నమ్మాను. అందుకే అలాంటి కథతోనే ఆర్ఎక్స్ 100 తీశానని’’ చెప్పుకొచ్చాడు అజయ్ భూపతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు