మాస్ మహారాజా కొత్తగా ట్రయ్ చేస్తున్నాడు

మాస్ మహారాజా కొత్తగా ట్రయ్ చేస్తున్నాడు

మారుతున్న కాలానికి తగ్గట్టు ప్రేక్షకుల అభిరుచులు చాలా వేగంగా మారిపోతున్నాయి. అందుకే హీరోలంతా ఇంతవరకు చేస్తున్న మూస పాత్రలు పక్కనపెట్టి కొత్తదనం ఉన్న సబ్జెక్టుల కోసం చూస్తున్నారు. కానీ మాస్ మహారాజా రవితేజ మాత్రం తనకు అలవాటయిన స్టయిల్లోనే సినిమాలు చేస్తూ వచ్చాడు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఘోరమైన ఫలితాన్ని చూడాల్సి వచ్చింది. అతడి రెండు లేటెస్ట్ మూవీస్ టచ్ చేసి చూడు.. నేలటిక్కెట్టు డిజాస్టర్లుగా మిగిలాయి.

దీంతో ఫ్యాన్స్ ను.. ప్రేక్షకులను మెప్పించేందుకు రవితేజ ఈసారి ఓ కొత్త తరహా సబ్జెక్టుతో చేసే సినిమాకు ఓకే చెప్పాడని తెలిసింది. ఎక్కడకు పోతావు చిన్నవాడా ఫేమ్ డైరెక్టర్ వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు. కాకుంటే ఇది రొటీన్ గా ఉండే డ్యూయల్ రోల్ కాదు. ఈ సినిమాలో తండ్రి - కొడుకు క్యారెక్టర్లు రెండూ మాస్ మహారాజానే పోషించనున్నాడు. వి.ఐ. ఆనంద్ చెప్పిన స్టోరీలైన్ బాగా నచ్చడంతో ఈ సినిమా చేయాలని త్వరగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో కిక్ 2 సినిమాలో అలాంటి ప్రయత్నం చేసినా.. అది కాసేపు మాత్రమే కనిపించిన పాత్ర. ఇప్పుడు పూర్తి స్థాయిలో తండ్రిగా మెరుస్తాడట.

ప్రస్తుతం రవితేజ శ్రీను వైట్ల డైరెక్షన్ లో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా చేస్తున్నాడు. ఇందులో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటిస్తోంది. జులాయి సినిమా తరవాత బాలీవుడ్ కు షిఫ్టయిపోయిన ఇలియానా మళ్లీ ఇన్నాళ్లకు తెలుగు సినిమాలో చేస్తోంది. అమర్ అక్బర్ ఆంటోని షూటింగ్ పూర్తయ్యాక వి.ఐ. ఆనంద్ డైరెక్ట్ చేయబోయే సినిమాను రవితేజ స్టార్ట్ చేయనున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు