తగ్గుతున్న బాహుబలి

తగ్గుతున్న బాహుబలి

బాహుబలిలో కొండనయినా పిండి చేసేంత బలవంతుడిగా కనిపించాడు ప్రభాస్. ఆ సినిమాలన్నీ ప్రభాస్ చేస్తున్న సాహసాలన్నీ చూస్తుంటే అదంతా నిజమే అన్నట్టుగా భ్రమ పడ్డామంటే అది అతడు బాడీ బిల్డప్ చేసిన తీరే కారణం. ఆ సినిమా కోసం యంగ్ రెబల్ స్టార్ దాదాపు 120 నుంకి 130 కేజీల వరకు పెరిగాడు. కష్టమైన కసరత్తులెన్నో చేసి తీరైన కండలు సంపాదించి బాహుబలి పాత్రలో అదరగొట్టేశాడు.

ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ డైరెక్షన్ లో సాహో సినిమా చేస్తున్నాడు. దీని తరవాత జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్ లో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఈ మూవీ రామ్ చరణ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ రంగస్థలం లాగే పీరియాడికల్ మూవీ . 1930 నాటి కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ ఓ కొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఆనాటి జీవన శైలికి తగ్గట్టుగా ఉండేలా ప్రభాస్ బాడీ షేప్ మార్చుకునే పనిలో పడ్డాడు. ఈ సినిమా కోసం తన వెయిట్ 90 కేజీలకు తగ్గించుకోవాలని డిసైడయ్యాడు. దానికి తగ్గట్టు స్ట్రిక్ట్ డయిట్ మెయిన్ టెయిన్ చేస్తూ బాగా వర్కవుట్లు చేస్తున్నాడట.

రాధాకృష్ణ మూవీలో స్లిమ్ అండ్ స్టయిలిష్ లుక్ తో ప్రభాస్ ఇంప్రెస్ చేస్తాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సాహో మూవీ షూటింగ్ కోసమే ఫుల్ టైం కేటాయించాడు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. తెలుగుతోపాటు మళయాళం - హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు