జగపతిబాబు.. భలే సినిమా పట్టాడు

జగపతిబాబు.. భలే సినిమా పట్టాడు

విలన్.. క్యారెక్టర్ రోల్స్‌లోకి మారాక జగతిబాబు జీవితమే మారిపోయింది. సరైన సినిమాల్లేక లైం లైట్లో లేకుండా పోయిన వాడు.. ఒక్కసారిగా ఫుల్ బిజీ అయిపోయాడు. క్రేజీ ప్రాజెక్టులతో దక్షిణాదిన అత్యధిక డిమాండ్ ఉన్న నటుల్లో ఒకడిగా  ఎదిగాడు. తెలుగు.. తమిళం.. మలయాళం.. ఇలా మూడు భాషల్లోనూ సినిమాలు చేస్తూ సాగుతున్నాడు జగపతి.

తమిళంలో ఇప్పటికే విజయ్ లాంటి పెద్ద హీరోకు విలన్‌గా నటించిన జగపతి.. ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో కీలక పాత్ర దక్కించుకున్నాడు. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సూర్య కథానాయకుడిగా నటిస్తున్న‘ఎన్జీకే’ సినిమాలో జగపతి బాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందిస్తున్న సినిమా ఇది. సెల్వ సినిమాల్లో ప్రతి పాత్రకూ ప్రాధాన్యముంటుంది. చాలా టిపికల్‌గా ఉంటాయి అతడి సినిమాల్లోని పాత్రలు. ఇందులో జగపతి చేస్తున్నది నెగెటివ్ రోలే అని సమాచారం. సూర్య క్యారెక్టర్ కూడా ఇందులో చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. కొన్నేళ్లుగా సెల్వ కెరీర్ ఏమంత గొప్పగా లేదు. అయినప్పటికీ సూర్య లాంటి పెద్ద హీరో అతడికి అవకాశమిచ్చాడు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవడానికి సెల్వ కసిగా పని చేస్తున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో రకుల్ ప్రీత్.. సాయిపల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు. అందరూ తెలుగు వాళ్లకు పరిచయమున్న నటీనటులే కావడంతో ఈ చిత్రాన్ని తెలుుగలోనూ పెద్ద ఎత్తున రిలీజ్ చేసే అవకాశముంది. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు