ఏళ్లకు ఏళ్లు స్క్రిప్టు చర్చలేనా?

ఏళ్లకు ఏళ్లు స్క్రిప్టు చర్చలేనా?

గత దశాబ్ద కాలంలో టాలీవుడ్లో రెండంకెల సంఖ్యలో రైటర్లు డైరెక్టర్లయ్యారు. రచయితగా చిన్నా చితకా సినిమాలు చేసిన వాళ్లు కూడా దర్శకులైపోయారు. కానీ దశాబ్దం కిందటే స్టార్ రైటర్‌గా పేరు తెచ్చుకుని.. కోన వెంకట్ తో కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు హిట్లు ఇచ్చిన గోపీమోహన్ మాత్రం ఇప్పటికీ దర్శకుడు కాలేకపోయాడు.అలాగని అతడికి దర్శకుడయ్యే ఉద్దేశం లేదా అంటే అదేమీ కాదు. నాలుగైదేళ్లుగా అందుకోసం ప్రయత్నిస్తున్నాడు. సునీల్ మంచి ఫాంలో ఉన్నపుడు అతడితో సినిమా చేయాలనుకున్నాడు. కానీ కుదర్లేదు.

ఆపై రెండున్నరేళ్ల కిందట ‘ఇష్టంగా సంతోషంగా ఆనందంగా’ అంటూ తన డైరెక్టరోరియల్ డెబ్యూ మూవీకి టైటిల్ కూడా ప్రకటించాడు. కానీ ఆ సినిమా కూడా ఇప్పటిదాకా పట్టాలెక్కలేదు. అప్పుడప్పుడూ ఏదో ఒక అప్ డేట్ ఇస్తున్నాడు కానీ.. సినిమా మాత్రం కార్యరూపం దాల్చట్లేదు. కొన్ని నెలల కిందట న్యూజెర్సీలో పర్యటించిన గోపీ.. దర్శకుడిగా తన తొలి సినిమాకు లొకేషన్ల ఎంపిక పూర్తయిందని చెప్పాడు. ఇప్పుడేమో కొత్తగా చివరి దశ కథా చర్చలు పూర్తయ్యాయని.. జులైలో ప్రధాన నటీనటులకు కథ వినిపించబోతున్నానని చెప్పాడు.

ఇలా ఏళ్లకు ఏళ్లు స్క్రిప్టు.. ఇతర వ్యవహారాల మీదే పని చేస్తే సినిమా ఎప్పుడు తీస్తాడో ఏమో గోపీ మోహన్. ఆ స్థాయి రచయిత దర్శకత్వ అరంగేట్రానికి ఇంత టైం తీసుకోవడం.. ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి పక్కాగా ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో ఏమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు