షకలక శంకర్.. ప్రచార ఎత్తుగడేనా?

షకలక శంకర్.. ప్రచార ఎత్తుగడేనా?

కామెడీ పాత్రలతో ఆకట్టుకుని.. ఆ తర్వాత హీరోలైన చాలామంది నటుల బాటలోనే షకలక శంకర్ కూడా నడిచాడు. హీరోగా ఒకటికి రెండు సినిమాలు చేశాడు. అందులో మొదటిది ‘శంభో శంకర’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ఐతే ఈ చిత్ర ప్రోమోలు చూస్తే ఏమంత కొత్తగా.. ఆసక్తికరంగా అనిపించలేదు. పైగా చాలా సినిమాలతో కలిపి గుంపులో గోవిందా అన్నట్లుగా రిలీజవుతోంది. ఈ నేపథ్యంలో ఏదైనా కాంట్రవర్శీ క్రియేట్ చేస్తే తప్ప సినిమా గురించి చర్చ జరిగి.. జనాలు థియేటర్లకు రారనుకున్నాడో ఏమో.. షకలక శంకర్ ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు.

తాను హీరో కావడం కోసం ఒక కథ రెడీ చేసుకుని టాలీవుడ్ ప్రముఖుల్ని కలిస్తే వాళ్లు తనను ఎలా ట్రీట్ చేసింది చెప్పుకొచ్చాడు శంకర్. త్రివిక్రమ్.. దిల్ రాజు.. అల్లు శిరీష్.. రవితేజ.. ఇలా ప్రముఖుల్నే అతను లక్ష్యంగా చేసుకున్నాడు. రవితేజ మినహా అందరి మీదా నెగెటివ్ కామెంట్లే చేశాడు. తనను వీళ్లెవ్వరూ ప్రోత్సహించలేదన్నట్లే మాట్లాడాడు. ఐతే శంకర్ అనేవాడు హీరో కావాలనుకుంటే వీళ్లెందుకు ఎగ్జైట్ కావాలి.. డబ్బులు పెట్టాలి.. ఇది కొంచెమైనా లాజికల్‌గా అనిపిస్తోందా? సినీ నిర్మాణం అంటే అంత తేలికైన విషయమా? ఇలా అడగ్గానే అలా తీసి రెండు కోట్లిచ్చేస్తారా? మరీ ఇంత చిన్న విషయం కూడా తెలియనంత అమాయకుడా శంకర్? అతడి వ్యాఖ్యల తీరు చూస్తే.. ఊరికే వివాదం రేపి ప్రచారం పొందడానికి వేసిన ఎత్తుగడ లాగా అనిపిస్తోంది యవ్వారం. మరి ఆ ఎత్తుగడ ఏమాత్రం ఫలిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు