ఆ హీరోయిన్‌తో మాస్‌ మహారాజ్‌కి ఏంటి లింకు?

ఆ హీరోయిన్‌తో మాస్‌ మహారాజ్‌కి ఏంటి లింకు?

'నేల టిక్కెట్టు' చిత్రంతో పరిచయమైన మాళవిక శర్మకి తొలి బ్రేక్‌ ఇచ్చింది రవితేజనే. ఆమెని ఎక్కడ చూసాడనేది తెలియదు కానీ 'నేల టిక్కెట్టు'లో హీరోయిన్ల కోసం అన్వేషిస్తోంటే తన పేరుని రవితేజ సజెస్ట్‌ చేసాడని దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ కూడా చెప్పాడు. తరచుగా పార్టీలు ఇచ్చే రవితేజకి మోడలింగ్‌ నుంచి వచ్చి అవకాశాల కోసం చూస్తోన్న మాళవిక తారసపడి వుండొచ్చు. నేల టిక్కెట్టు ఫ్లాప్‌ అవడంతో ఆమెపై ఇండస్ట్రీ దృష్టి పడలేదు. దీంతో మరోసారి తనకి అవకాశమిచ్చి బ్రేక్‌ ఇవ్వడానికి రవితేజ కృషి చేస్తున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

రవితేజ నటించే తదుపరి చిత్రాల్లో ఒకదాంట్లో మాళవిక కథనాయికగా ఖరారైందట. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' దర్శకుడు వి.ఐ. ఆనంద్‌తో రవితేజ ఓ చిత్రం చేయబోయే చిత్రంలో మాళవిక హీరోయిన్‌గా నటిస్తుందని సమాచారం. హీరోయిన్‌ పేరుని రవితేజే సిఫార్సు చేసాడని, నేల టిక్కెట్టు ఫ్లాప్‌ అయినా తన గ్లామర్‌తో ఆమె మాస్‌ని ఆకట్టుకుందని అనలైజ్‌ కూడా చేసాడని టాక్‌ వుంది.

ఒక హీరోయిన్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాకుండా, తన కాంబినేషన్‌లో ఫ్లాప్‌ ఇచ్చినా కానీ మళ్లీ రిపీట్‌ చేస్తున్నాడంటే, ఆమెకి అవకాశాలిప్పించి బ్రేక్‌ ఇవ్వాలని చూస్తున్నాడంటే ఏదో వుందనే గుసగుసలు ఆల్రెడీ స్టార్ట్‌ అయిపోయాయి. తన పనేదో తాను చేసుకుంటూ సిఫార్సుల జోలికి పోని రవితేజ ఇప్పుడో యువ నటికి రికమండేషన్‌ చేయడం ఆశ్చర్యమే మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు