అమెరికాలో ఆ సినిమాకు పెద్ద రిలీజే..

అమెరికాలో ఆ సినిమాకు పెద్ద రిలీజే..

రెండేళ్ల కిందట పెద్దగా అంచనాలేమీ లేకుండా విడుదలైన ‘పెళ్ళిచూపులు’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అమెరికాలో ఆ చిత్రం ఏకంగా 1.4 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేసింది. చాలా తక్కువ మొత్తానికి హక్కులు దక్కించుకున్న బయ్యర్ అప్పట్లో లాభాల పంట పండించుకున్నాడు. ఇప్పుడు ‘పెళ్ళిచూపులు’ దర్శకుడు రూపొందించిన రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’కి అమెరికాలో మంచి క్రేజ్ ఉంది.

అక్కడ మంచి క్రౌడ్ పుల్లర్ వచ్చి చాలా రోజులైంది. అందరూ కొత్తవాళ్లే నటించినప్పటికీ తరుణ్ భాస్కర్, సురేష్ బాబుల బ్రాండ్ వాల్యూ కలిసొచ్చి ఈ చిత్రానికి మంచి హైప్ వచ్చింది. స్టార్ వాల్యూ లేని ఈ చిత్రాన్ని అక్కడ 142 లొకేషన్లలో రిలీజ్ చేస్తుండటాన్ని బట్టి ఆ హైప్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

అర్బన్ యూత్‌కు బాగా కనెక్టయ్యేలా ఉన్న టీజర్.. ట్రైలర్ ‘ఈ నగరానికి ఏమైంది’కి ప్లస్ అయ్యాయి. ఈ తరహా సినిమాలు అమెరికన్ తెలుగు ఆడియన్స్‌కు కూడా బాగా కనెక్టవుతాయి. ‘పెళ్ళిచూపులు’ తరహాలోనే దీనికి కూడా ముందుగానే ప్రివ్యూలు వేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇండస్ట్రీలో టాక్ స్ప్రెడ్ అయింది. అందుకే అమెరికాలోనూ ఈ సినిమాకు క్రేజ్ వచ్చింది.

బయ్యర్ మంచి రేటుకే హక్కులు కొన్నట్లు తెలుస్తోంది. 28న పెద్ద ఎత్తున ప్రిమియర్లు కూడా ప్లాన్ చేశారు. ఓపెనింగ్స్ కూడా బాగానే వస్తాయని ఆశిస్తున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈజీగా మిలియన్ మార్కును దాటేసే అవకాశముంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘ఈ నగరానికి ఏమైంది’ని ఓ మోస్తరు స్థాయిలోనే రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ‘పెళ్ళిచూపులు’ మ్యాజిక్ రిపీట్ చేస్తుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు