‘బాహుబలి’ ని కొట్టడానికి రెడీ అవుతుంది

‘బాహుబలి’ ని కొట్టడానికి రెడీ అవుతుంది

‘బాహుబలి’కి దీటైన భారీ చిత్రం చేయాలని తమిళ దర్శకులు కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. కానీ దాని దరిదాపుల్లోకి కూడా ఏ సినిమా వెళ్లట్లేదు. అచ్చంగా ‘బాహుబలి’ స్టయిల్లోనే ఓ భారీ జానపద చిత్రానికి తమిళ సీనియర్ దర్శకుడు సుందర్ ప్రణాళికలు రచించాడు. ‘సంఘమిత్ర’ పేరుతో ఆ సినిమా తెరకెక్కించేందుకు దాదాపు మూడేళ్ల నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. ఐతే గత ఏడాదే మొదలు కావాల్సిన ఈ సినిమా రకరకాల కారణాలతో ఆలస్యమవుతూ వస్తోంది.

కొన్ని నెలలుగా ఈ సినిమా గురించి ఏ సమాచారం. లేదు. ఐతే ఇప్పుడు సుందర్ స్వయంగా ‘సంఘమిత్ర’ గురించి అప్ డేట్ ఇచ్చాడు. ఆగస్టులో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందని ప్రకటించాడు. నిర్మాణ సంస్థ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. షూటింగ్ షెడ్యూల్స్.. ఇతర కార్యక్రమాలకు సంబంధించి పక్కా ప్రణాళిక రెడీ చేస్తున్నారట. సుందర్ ఈ సినిమా కోసం ఎప్పుడో స్టోరీ బోర్డ్ తో సహా స్క్రిప్టు రెడీ చేశాడు. ప్రి ప్రొడక్షన్.. విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా ముందే మొదలై ఆగాయి. వాటిని మళ్లీ మొదలుపెట్టనున్నారు.

జయం రవి.. ఆర్య హీరోలుగా నటించే ఈ చిత్రంలో హిందీ భామ దిశా పఠానిని కథానాయికగా ఫైనలైజ్ చేశారు. ఆమె ఈ చిత్రం కోసం బల్క్ డేట్స్ కేటాయించినట్లు తెలిసింది. తమిళంలో 100కు పైగా సినిమాలు నిర్మించిన థెండ్రాల్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది. ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తాడు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు