రేణుతో ఉన్నది భర్త కాదండీ బాబులూ..

రేణుతో ఉన్నది భర్త కాదండీ బాబులూ..

సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల గురించి సోషల్ మీడియా జనాలకు ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. వాళ్లకు సంబంధించి చీమ చిటుక్కుమన్నా చర్చలు పెట్టేస్తారు. ఎక్కడెక్కడి సమాచారమో తెచ్చి సోషల్ మీడియాలో పోసేస్తారు. ఏది నిజం ఏది అబద్ధం అని చూడకుండా ప్రచారాలు సాగిస్తారు.

ఇప్పుడు తెలుగు నెటిజన్లకు ఒక హాట్ టాపిక్ దొరికింది. అదే.. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పెళ్లి వ్యవహారం. ఇటీవలే ఆమె రెండో పెళ్లికి సిద్ధమై.. నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఐతే నిశ్చితార్థం గురించి చెప్పింది కానీ.. వరుడెవరన్నది వెల్లడించలేదు రేణు. అతడి ముఖాన్ని చూపించీ చూపించనట్లు లైట్‌గా అలా చూపించింది. జనాల్లో క్యూరియాసిటీ పెంచింది. ఈలోపు నెటిజన్లు తమ క్రియేటివిటీ చూపించేశారు.

ఎక్కడెక్కడో వెతికి రేణుతో ఒక అబ్బాయితో ఉన్న ఫొటోను పట్టుకొచ్చి ఇదిగోండి రేణుకు కాబోయే భర్త అని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలు వైరల్ అయిపోయాయి. అందులో ఆ వ్యక్తి పెళ్లికొడుకుగా తయారై ఉండటంతో ఎంగేజ్మెంట్ ఫొటో ఇదే అని జనాలు నమ్మేస్తున్నారు. కానీ అసలు వాస్తవం ఏంటంటే.. ఆ ఫొటోలో ఉన్నది రేణుకు కాబోయే భర్త కాదు. ఆమెకు స్వయానా సోదరుడు. మూడేళ్ల కిందట అతడికి పెళ్లయింది. ఆ సందర్భంగా రేణుతో దిగిన ఫొటో అది. రేణు లుక్‌లో ఉన్న తేడాను కూడా గుర్తించకుండా నెటిజన్లు మాత్రం అది ఎంగేజ్మెంట్ ఫొటో అని నమ్మేసి.. అతనే ఆమెకు కాబోయే భర్త అనుకుంటున్నారు.

ఇది రేణును ఎంత బాధ పెడుతుందో చెప్పేదేముంది? ఇప్పుడామె అతను నా సోదరుడు.. ఇదిగో నా భర్త అని కాబోయేవాడి గురించి షేర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ రేణు రెండో పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కొందరు అభిమానులకు భయపడి తనకు కాబోయే భర్త వివరాలు బయటపెట్టడానికి అసలేమాత్రం ఇష్టపడని రేణు ఏం చేస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు