ఫ్లాప్‌ హీరోకి అగ్ని పరీక్ష

ఫ్లాప్‌ హీరోకి అగ్ని పరీక్ష

కపూర్‌ల వంశానికి చెందిన వాడే అయినా కానీ రణభీర్‌ కపూర్‌ ఇంతవరకు తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. టాలెంట్‌కి ఏ లోటు లేకపోయినా, స్టార్‌ దర్శకులతో పని చేస్తున్నా అతడికి కాలం కలిసి రావడం లేదు. చివరకు కరణ్‌ జోహార్‌ కూడా అతనికి హిట్‌ ఇవ్వలేకపోయాడు.

ట్రాక్‌ రికార్డ్‌ ఘోరంగానే వున్నా కానీ రణ్‌భీర్‌ తదుపరి చిత్రం 'సంజు' మాత్రం భారీ అంచనాలతో వస్తోంది. సంజయ్‌దత్‌ జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్‌ హిరాని దర్శకుడు. ఇంతవరకు చేసిన ప్రతి సినిమాతో బ్లాక్‌బస్టర్‌ సాధించిన హిరాని ఈసారి మిస్‌ఫైర్‌ అవుతాడని అనుకోవడానికి లేదు. కాకపోతే రణ్‌భీర్‌ బ్యాడ్‌ టైమ్‌ గురించి తెలిసిన వారు ఈసారి అయినా అతడిని అదృష్టం వరిస్తుందా? సంజుతో అతను అంచనాలని అందుకోగలడా అని అనుమానిస్తున్నారు. సంజు చిత్రానికి రెండు వందల కోట్లకి పైగానే వసూళ్లు ఇండియాలో రావాలట.

హిరాని సినిమాకి అది కేక్‌ వాకే అయినా కానీ రణ్‌భీర్‌ వల్ల అవుతుందా, అతడు మాస్‌ జనాలని థియేటర్లకి రాబట్టగలడా అని బాలీవుడ్‌ ట్రేడ్‌ డౌట్‌ పడుతోంది. ఈ శుక్రవారం విడుదలవుతోన్న సంజు చిత్రానికి అడ్వాన్స్‌ బుకింగ్‌ ట్రెండ్‌ చూస్తే మాత్రం మల్టీప్లెక్సుల్లో అదిరిపోయే ఓపెనింగ్‌ ఖాయమనిపిస్తోంది. తొలి రోజు ముప్పయ్‌ కోట్లు, తొలి వారాంతంలో వంద కోట్ల నెట్‌ వసూళ్లు ఇండియాలో వస్తాయనే అంచనాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English