మహేష్‌ రెమ్యూనరేషన్‌లో కోత పడింది

మహేష్‌ రెమ్యూనరేషన్‌లో కోత పడింది

మహేష్‌ ఇరవై అయిదవ చిత్రానికి ఇద్దరు నిర్మాతలు కాస్తా ముగ్గురయిన సంగతి తెలిసిందే. పివిపి సంస్థతో వున్న పితలాటకాన్ని మహేష్‌ పరిష్కరించుకోలేకపోవడంతో అతడిని కూడా ఈ చిత్ర నిర్మాతలలో ఒకరిగా చేర్చుకోక తప్పలేదు. ఒక సినిమాకి ముగ్గురు నిర్మాతలంటే లాభాల పరంగా లోటు పడడం సహజమే. దిల్‌ రాజు, అశ్వనీదత్‌ మధ్యనే వాటాల పరంగా పేచీ నడుస్తోండగా పివిపి కూడా భాగస్వామిగా రావడం వారికి ఏమాత్రం రుచించలేదట.

లీగల్‌ సమస్యల్లో పడితే షూటింగ్‌ నిలిచిపోతుందని, దాని కంటే ఇలా పరిష్కరించుకోవడమే మేలని మహేష్‌ నచ్చచెప్పాడట. అయితే ఈ సినిమా వల్ల లాభం పెద్దగా వుండదనే నిర్మాతల గోడు విని తన పారితోషికాన్ని ఇరవై అయిదు శాతం తగ్గించుకున్నాడట. తన పారితోషికం తగ్గడం ద్వారా సినిమా బడ్జెట్‌ గణనీయంగా తగ్గుతుంది. తద్వారా ముగ్గురు నిర్మాతలకీ లాభం పెరుగుతుంది. ఈ విధంగా నిర్మాతలని సంతోషపెట్టి తన పారితోషికంలో లోటుని మహేష్‌ భరిస్తున్నాడన్నమాట.

బ్రహ్మూెత్సవం పరాజయం తర్వాత బయ్యర్లకి కాంపన్సేషన్‌ ఇవ్వాలని అనుకున్నారు కానీ అది జరగలేదు. అప్పుడు వెనక్కి ఇవ్వని పారితోషికం ఇప్పుడు తగ్గించుకున్నట్టయింది. ఏదేమైనా ఒకే సినిమాతో ముగ్గురు నిర్మాతలకి ఇచ్చిన డేట్స్‌ని మహేష్‌ వాడేసినట్టవుతోంది. దీని వల్ల అశ్వనీదత్‌, పివిపితో వున్న అగ్రిమెంట్లు తీరిపోవడంతో మహేష్‌ ఫ్రెష్‌ డీల్స్‌ చేసుకునే వెసులుబాటు చిక్కింది. వన్‌ షాట్‌ త్రీ బర్డ్స్‌ అంటే ఇదేనేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English