క్రిష్‌ ఐడియాకి బాలకృష్ణ ససేమీరా

క్రిష్‌ ఐడియాకి బాలకృష్ణ ససేమీరా

ఎన్టీఆర్‌ జీవిత కథని సింగిల్‌ సినిమాగా తీర్చిదిద్దడం కష్టమని, ఆయన జీవితాన్ని రెండు భాగాలుగా తీద్దామనే ప్రపోజల్‌ని క్రిష్‌ తెచ్చాడట. బయోపిక్‌ అంటే జీవితం మొత్తం చూపించాలి కనుక ఎన్టీఆర్‌ మరణం వరకు అన్నిటినీ చూపిద్దామని చెప్పాడట. అయితే ఈ ఐడియాకి బాలకృష్ణ సుతారమూ అంగీకరించలేదట.

ఎన్టీఆర్‌ పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రిగా జయకేతనం ఎగుర వేయడం వరకే ఈ చిత్రం వుండాలని, అదే క్లయిమాక్స్‌ కావాలని, అందులో ఏ మార్పు లేదని తేల్చి చెప్పారట. అలాగే రెండు భాగాలుగా తీయడమనేది సబబు కాదని, ఒక సినిమా అసంపూర్ణంగా వుండిపోయిన భావన ప్రేక్షకులకి కలుగుతుందని, అంచేత నిడివి ఎక్కువైనా ఒకే సినిమాలో చెప్పాలనుకున్న కథ మొత్తం చెప్పాలని బాలకృష్ణ స్పష్టం చేసారట.

ఎన్టీఆర్‌ కథకి తనదైన శైలిలో కథనం రాస్తోన్న క్రిష్‌ ఇప్పుడు తన స్క్రీన్‌ప్లేని ఒక్క సినిమాకే పరిమితమయ్యేలా మార్చుకోవాలన్నమాట. ఎన్టీఆర్‌ జీవితంలో ఏయే అంశాలని ఇందులో ప్రస్తావించాలి, ఏ విషయాలని ఎక్కువగా హైలైట్‌ చేయాలి, వేటిని అసలు ప్రస్తావించరాదు అంటూ ఒక లిస్టు వేసుకుని కథనం రాస్తున్నారట. అలాగే ఎన్టీఆర్‌ సమకాలీన నటులు, దర్శకుల కాస్టింగ్‌ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వగైరా అంశాల గురించి కూడా ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English