పెళ్లిని కుదిర్చిందెవ‌రో చెప్పిన రేణూ

పెళ్లిని కుదిర్చిందెవ‌రో చెప్పిన రేణూ

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ స‌తీమ‌ణి.. సినీ న‌టి రేణూదేశాయ్ రెండో పెళ్లి వ్య‌వ‌హారం ఇప్పుడు అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. త‌న పెళ్లి గురించి ఇంత‌వ‌ర‌కూ సోష‌ల్ మీడియాలో అర్థ‌మయ్యే రీతిలో పోస్టుల మీద పోస్టులు పెట్టిన ఆమె.. తాజాగా ఒక ఆంగ్ల మీడియాతో మాట్లాడారు.

త‌న‌కు కాబోయే భ‌ర్త‌కు సంబంధించిన వివ‌రాల్ని వెల్ల‌డించ‌ని ఆమె.. పెళ్లి సంబంధాన్ని కుదిర్చిందెవ‌ర‌న్న విష‌యంతో పాటు.. కాబోయే భ‌ర్త‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర ముచ్చ‌ట‌ను చెప్పారు. ఈసారి త‌న పెళ్లి ఎలా సాగుతుందో కూడా ఆమె వెల్ల‌డించారు.

తాజా పెళ్లి పూర్తిగా స‌న్నిహితులు కుదిర్చిన పెళ్లిగా ఆమె చెప్పారు. తాను చాలా సంతోషంగా ఉన్న‌ట్లు చెప్పిన రేణూ.. అతృత‌గా మాత్రం లేన‌న్నారు. ప్రేమ అనేది జీవితంలో ఒకేసారి క‌లుగుతుంద‌న్న ఆమె.. మ‌ళ్లీ మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డ‌టం కుద‌ర‌ద‌ని చెప్పేశారు.

గ‌డిచిన ఏడేళ్లుగా తాను ఒంట‌రిగానే ఉన్నాన‌ని.. అప్పుడూ సంతోషంగానే ఉన్నాన‌ని.. పెళ్లి చేసుకున్న త‌ర్వాత కూడా అంతే సంతోషంగా ఉంటాన‌ని చెప్పారు. త‌న కాబోయే భ‌ర్త గురించి చెబుతూ.. ఆయ‌న చాలా ప్ర‌శాంత‌మైన వ్య‌క్తి అని చెప్పారు. అయితే.. ఆయ‌న ఎవ‌రో.. ఎక్క‌డి వారో అన్న వివ‌రాల్ని మాత్రం ఆమె చెప్ప‌లేదు.

ప‌వ‌న్ తో పెళ్లికి ముందు స‌హ‌జీవ‌నం చేసిన రేణూ.. లివింగ్ రిలేష‌న్ గురించి మాట్లాడుతూ.. మ‌ళ్లీ స‌హ‌జీవ‌నం చేయాల‌ని తాను అనుకోలేద‌ని.. అందుకే సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా పెళ్లి చేసుకోవాల‌ని నిశ్చ‌యించుకున్న‌ట్లుగా ఆమె చెప్పారు. ఇదిలా ఉంటే.. రేణూ సెకండ్ మ్యారేజ్ మీద ప‌వ‌న్ రియాక్ట్ కావ‌టం.. విషెస్ చెప్ప‌టం తెలిసిందే. దీనిపై స్పందించిన ప్ర‌ముఖ నిర్మాత బండ్ల గ‌ణేశ్‌.. రేణూ మ్యారేజ్ మీద ప‌వ‌న్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. మా బాస్ అంటే ఇది అంటూ ప్ర‌శంసించారు. ప‌వ‌న్ ట్వీట్ ప‌ట్ల ఆయ‌న ఫ్యాన్స్ కూడా ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ప‌వ‌న్ లోని ఇంత‌టి స్వ‌చ్ఛ‌మైన మ‌న‌స్త‌త్వ‌మే త‌మ‌ను ఆయ‌న అభిమానులుగా చేస్తుందంటూ ప్ర‌శంస‌లతో ముంచెత్తుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు