శ్రీరెడ్డిని బ్యాన్‌ చేసేసారు

 శ్రీరెడ్డిని బ్యాన్‌ చేసేసారు

స్టార్ల మీద నిరాధారిత ఆరోపణలు చేస్తూ ఫేస్‌బుక్‌ పేజ్‌ని గాసిప్‌ కాలమ్‌గా మార్చేసుకున్న శ్రీరెడ్డి యుఎస్‌ సెక్స్‌ రాకెట్‌ విషయంలోను చాలా మంది పేర్లు బయట పెట్టింది. ఎవరి గురించి తన దగ్గర నిక్కచ్చి ఆధారాలు లేకపోయినా నోటికి తోచిన పేర్లు చెప్పేసింది.

బిగ్‌బాస్‌ షోలో స్థానం దక్కలేదనే అక్కసుతో ప్రస్తుతం షోలో పాల్గొంటున్న తేజస్వి, భానుశ్రీ, గీతామాధురి, శ్యామల పేర్లు కూడా ఈ లిస్టులో చేర్చేసి తన కుళ్లు బయట పెట్టుకుంది. బిగ్‌బాస్‌లో స్థానం దక్కకపోవడంతో నానిని ఏ విధంగా టార్గెట్‌ చేసిందో కూడా తెలిసిందే. మొదట్లో శ్రీరెడ్డిని చూసి ఉద్యమకారిణి అని భ్రమ పడి ఆమె వెంట నడిచిన మహిళా సంఘాల వారు ఇప్పుడు ఆమెపై అప్రకటిత నిషేధం విధించారు.

ఆమెతో కలిసి పోరాడేది లేదని, ఆమెకి చిత్తశుద్ధి లేదని, కేవలం పర్సనల్‌ పగ తీర్చుకోవడానికే ఆమె తమని వాడుకుంటోందని కొందరు యాక్టివిస్టులు పబ్లిగ్గానే కామెంట్‌ చేసారు. టీవీ ఛానల్స్‌ అయితే ఆమెని ఏనాడో దూరం పెట్టేసాయి. దీంతో ఇక తన ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ అకౌంట్లలో తనకి నచ్చని వారి మీద బురద జల్లుకుంటూ శ్రీరెడ్డి కాలం గడుపుతోంది.

గతంలో తనతో సాన్నిహిత్యం వున్నవారు, తనకి అవకాశాలు ఇచ్చిన వారు కూడా శ్రీరెడ్డిని దూరం పెడుతున్నారట. ఆమెతో ఏం మాట్లాడితే ఏ విధంగా దానిని పబ్లిసిటీకి వాడుకుంటుందోననే భయంతో ఆమెతో ఫోన్లో కూడా సంభాషించడం లేదట. అందుకే అంటారు ఎందులోనైనా అతి పనికి రాదని!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు