ఇదేంటి బాస్‌... మరీ ఇన్ని కుతంత్రాలా?

ఇదేంటి బాస్‌... మరీ ఇన్ని కుతంత్రాలా?

బిగ్‌బాస్‌ షోలో సెలబ్రిటీలని కాపాడ్డానికి, హౌస్‌లోని కీలకమైన సభ్యులు ఎలిమినేషన్లలోకి రాకుండా చూడడానికి నిర్వాహకులు చేస్తోన్న కుతంత్రాలు అన్నీ ఇన్నీ కావు. గత వారం ఎలిమినేషన్లకి ఇద్దరిద్దరు సభ్యుల్ని పంపించడంతో హౌస్‌లో గుత్తాధిపత్యం చేస్తోన్న తేజస్వి, తనీష్‌ ఎలిమినేషన్‌లోకి రాలేదు.

ఈసారి ఎలిమినేషన్‌ ఓపెన్‌గా పెట్టారు. దీంతో హౌస్‌లో బుల్లీయింగ్‌ చేసే వారిని నామినేట్‌ చేయడానికి ఆటగాళ్లు జంకారు. ఉదాహరణకి బాబు గోగినేనిని నామినేట్‌ చేయాలని అంతకు ముందు డిస్కషన్లలో మాట్లాడుకున్నారు. కానీ ఓపెన్‌ నామినేషన్‌ అయ్యేసరికి ఒక్కరు కూడా అతడిని నామినేట్‌ చేయలేదు. అలాగే ఎవరి మీదకైనా ఒంటికాలి మీద కయ్యానికి వెళ్లిపోయే తనీష్‌ జోలికి ఓపెన్‌ నామినేషన్లలో ఎవరూ వెళ్లలేదు. దీంతో గణేష్‌, కిరీటి సాఫ్ట్‌ టార్గెట్‌ అయిపోయారు.

రికార్డు స్థాయిలో వీరిని తొమ్మిదేసి మంది నామినేట్‌ చేసారు. తేజస్విని కూడా ఎలిమినేషన్‌కి రాకుండా చూసుకోవడానికి వేసిన పన్నాగమే అయినా గణేష్‌ ధైర్యం చేసి ఆమెని నామినేట్‌ చేయడంతో మరొకరు కూడా నామినేట్‌ చేయడం వల్ల తేజస్వి కూడా ఎలిమినేషన్లలోకి వచ్చింది. అయితే మరింత మంది వీక్‌ కంటెస్టెంట్‌లు నామినేట్‌ అయ్యారు కనుక తేజస్వి ఎలిమినేట్‌ అయ్యే అవకాశం లేదు.

మొదటి రెండు వారాలు కామన్‌ పీపుల్‌ని ఎలిమినేట్‌ చేసిన బిగ్‌బాస్‌ కీలకమైన హౌస్‌మేట్స్‌ని కాపాడుకునేందుకు వేస్తోన్న ఎత్తులు, చేస్తోన్న కుతంత్రాలు అయితే ఈ షో పక్షపాతం లేకుండా జరుగుతోందనే భావన కలిగించడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు