చిరు అల్లుడి కోసం స్టార్ డైరెక్టర్?

 చిరు అల్లుడి కోసం స్టార్ డైరెక్టర్?

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఒక కొత్త హీరో వస్తున్నాడంటే ఇండస్ట్రీ రెడ్ కార్పెట్ వేసి సినిమాల్లోకి ఆహ్వానిస్తుంది. ఆ ఫ్యామిలీ నుంచి ప్రతి హీరో కూడా బయటి నిర్మాణ సంస్థలోనే హీరోగా పరిచయం అవుతుంటాడు. దీన్ని బట్టే పరిశ్రమపై వాళ్ల పట్టేంటో అర్థం చేసుకోవచ్చు. చివరికి బయటి నుంచి మెగా ఫ్యామిలీలోకి వచ్చి చిరంజీవి అల్లుడైన కళ్యాణ్ దేవ్ సైతం బయటి సంస్థలోనే తొలి సినిమా చేయడం విశేషం.

సాయికొర్రపాటి నిర్మాణంలో అతను హీరోగా తెరకెక్కిన ‘విజేత’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదల కాకముందే కళ్యాణ్ రెండో సినిమా కూడా ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. అతడి తర్వాతి సినిమాను మరో పెద్ద నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేయబోతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడిగా హరీష్ శంకర్ తెరమీదికి రావడం విశేషం.

‘దువ్వాడ జగన్నాథం’ విడుదలై ఏడాది దాటినా కూడా హరీష్ తన తర్వాతి సినిమాను మొదలుపెట్టలేదు. ‘దాగుడుమూతలు’ పేరుతో ఒక మల్టీస్టారర్ చేయడానికి సన్నాహాలు చేశాడు కానీ.. అది అనివార్య కారాణాల వల్ల పట్టాలెక్కలేదు. దానికి అడ్డంకులేంటన్నది అర్థం కావడం లేదు. ఆ చిత్రం మరింత ఆలస్యమయ్యేలా ఉండటంతో ఈ లోపు కళ్యాణ్ దేవ్‌తో సినిమా చేయాలని మెగా ఫ్యామిలీ నుంచి ప్రపోజల్ వెళ్లినట్లు సమాచారం. కళ్యాణ్‌తో సినిమా చేస్తే చిరంజీవికి చేరువ కావడానికి అవకాశముంటుందని భావించి హరీష్ ఈ ప్రపోజల్‌ను సీరియస్‌గానే పరిశీలిస్తున్నట్లు సమాచారం. అతను ఓకే అంటే త్వరలోనే సినిమా మొదలయ్యే అవకాశముంది. మరి హరీష్ ఏమంటాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English