ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఆ జోడీ

ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఆ జోడీ

ముంబయి భామ హన్సిక మొత్వాని కథానాయికగా పరిచయమైంది తెలుగు సినిమాతోనే. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో నటించిన ‘దేశముదురు’ లాంటి సూపర్ హిట్ మూవీతో ఆమె హీరోయినైంది. ఆ తర్వాత తెలుగులో ఆమెకు మంచి మంచి ఛాన్సులొచ్చాయి. కొన్నేళ్ల పాటు ఇక్కడ బాగానే హవా సాగించింది. కానీ తర్వాత కెరీర్ గాడి తప్పింది.

కోలీవుడ్‌కు వెళ్లిపోయి.. అక్కడే కథానాయికగా సెటిలైంది. కొంత కాలంగా తమిళంలో కూడా ఆమె కెరీర్ అంతంతమాత్రంగానే ఉంది. ఆమె త్వరలోనే సినిమాలకు టాటా చెప్పేయాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. తెలుగులో అయితే హన్సిక సినిమా చేసి చాలా కాలం అయిపోయింది.

ఇక మళ్లీ ఇక్కడ ఆమెకు మరో అవకాశం రావడం కష్టమే అనుకున్నారు. కానీ హన్సికకు ఇప్పుడు మంచి ఆఫర్ తగిలినట్లు సమాచారం. యువ కథానాయకుడు నితిన్ హీరోగా.. ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల రూపొందించబోయే చిత్రంలో హన్సికను కథానాయికగా ఎంచుకున్నారట. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది. ఈ చిత్రంలో మరో కథానాయికకు కూడా చోటు ఉన్నట్లు సమాచారం.

నితిన్-హన్సిక జంటగా నటించడం ఇది తొలిసారి కాదు. ఎనిమిదేళ్ల కిందటే వీళ్లిద్దరూ కలిసి ‘సీతారాముల కళ్యాణం లంకలో’ అనే సినిమా చేశారు. ఆ సినిమా ఫ్లాపైంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇదే జోడీ మళ్లీ కలిసి నటిస్తుండటం విశేషమే. మరి ఈ చిత్రమైనా హన్సిక టాలీవుడ్ కెరీర్‌కు మళ్లీ ఊపు తెస్తుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు