బిగ్ బాస్ లో వారిద్ద‌రి మ‌ధ్య స‌మ్ థింగ్‌.. స‌మ్ థింగ్‌!

బిగ్ బాస్ లో వారిద్ద‌రి మ‌ధ్య స‌మ్ థింగ్‌.. స‌మ్ థింగ్‌!

బిగ్ బాస్ అంటేనే వివాదాలు. ఏదో ఒక‌టి చ‌ర్చ‌ను రేపే ఈ షోలో సీజ‌న్ వ‌న్‌కు భిన్న‌మైన దృశ్యాలు కొన్ని సీజ‌న్ 2లో ఆవిష్కృత‌మ‌వుతున్నాయి. తాజాగా జ‌రుగుతున్న ఎపిసోడ్ లో తేజ‌స్వీ.. సామ్రాట్‌లు స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా మారారు. వారిద్ద‌రి మ‌ధ్య స్నేహానికి మించిన రిలేష‌న్ ఏదో ఉంద‌న్న అనుమానం క‌లిగేలా వ్య‌వ‌హ‌రించ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

మిగిలిన హౌస్ మేట్స్ కు దూరంగా ఉండ‌టం.. అదే ప‌నిగా గుస‌గుస‌లాడుకోవ‌టం.. ఒక‌రి మీద ఒక‌రు ప‌డ‌టం లాంటి వాటితో పాటు.. ఒక‌రికొక‌రు తినిపించుకోవ‌టం లాంటి వాటితో ప్రేమ జంట‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే.. ఇదంతా గేమ్ లో భాగంగానే చేస్తున్నారా?  లేక‌.. నిజంగానే వారిద్ద‌రి మ‌ధ్య స‌మ్ థింగ్‌.. స‌మ్ థింగ్ న‌డుస్తుందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

అయితే.. కొంద‌రి అభిప్రాయం ప్ర‌కారం సామ్రాట్ తో చ‌నువుగా ఉంటున్న తేజ‌స్వి.. వ్యూహాత్మ‌కంగానే అలా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తేజ‌స్విది అంతా ప‌క్కా ప్లానింగ్ అని.. ఆమె గేమ్ ప్లే చేస్తుంద‌న్న మాట‌ను చెబుతున్నారు. ఏమైనా.. ఇప్ప‌టివ‌ర‌కూ తెలుగు బిగ్ బాస్ లో క‌నిపించ‌ని రీతిలో స‌మ్ థింగ్ స్పెష‌ల్ జంట‌గా తేజ‌స్వి.. సామ్రాట్ లు నిలుస్తున్నార‌న్న‌ది చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు