బిగ్ బాస్ లో మూడోసారీ కామ‌న్ మ్యానే టార్గెట్ అయ్యాడు

బిగ్ బాస్ లో మూడోసారీ కామ‌న్ మ్యానే టార్గెట్ అయ్యాడు

ఏమైనా జ‌ర‌గొచ్చ‌న్న ట్యాగ్ లైన్ తో మొద‌లైంది తెలుగు బిగ్ బాస్ సీజ‌న్ 2. మిగిలిన భాష‌ల్లోని బిగ్ బాస్ తో పోలిస్తే.. తెలుగు బిగ్ బాస్ కాస్త ప‌ద్ధ‌తిగా జ‌రుగుతుంద‌ని చెప్పాలి. అయితే..ఈసారి ముగ్గురు కామ‌న్ మ్యాన్ల‌ను ఎంపిక చేసి హౌస్ లోకి పంప‌టం తెలిసిందే. వ‌రుస‌ రెండు వారాల్లో ఇద్ద‌రు కామ‌న్ మ్యాన్ల‌ను ఎలిమినేట్ కావ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సెల‌బ్రిటీలు.. కామ‌న్ మ్యాన్ల‌ను టార్గెట్ చేసి.. వారిని బ‌య‌ట‌కు పంపుతున్న భావ‌న అంద‌రిలోనూ వ్య‌క్త‌మ‌వుతోంది. ల‌క్ష‌ల మందికి ఆడిష‌న్స్ నిర్వ‌హించిన ముగ్గురు సామాన్యుల్ని సెల‌బ్రిటీల‌తో పాటు హౌస్ లోకి పంపితే.. రెండు వారాలు తిర‌క్క ముందే ఇద్ద‌రు సామాన్యుల్ని బ‌య‌ట‌కు పంపేసిన వైనంపై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా అలాంటిదో మ‌రొక‌టి చోటు చేసుకోవ‌టం చూస్తే.. బిగ్ బాస్ లో కామ‌న్ మ్యాన్ల మీద టార్గెట్ ప‌క్కా అన్నది నిజ‌మ‌ని తేలుతోంది.

ప్రేక్ష‌కుల‌కు వ‌చ్చే ఓట్ల ఆధారంగానే ఎలిమినేష‌న్ ఉంటుంద‌ని చెప్పినా.. బిగ్ బాస్ స్క్రిప్ట్ లో భాగంగానే కామ‌న్ మ్యాన్ల‌ను బ‌య‌ట‌కు పంపుతున్నార‌న్న అభిప్రాయం అంత‌కంత‌కూ పెరిగేలా.. మూడో వారం మూడో కామ‌న్ మ్యాన్ ను టార్గెట్ చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈసారి కామ‌న్ మ్యాన్ గా హౌస్ లో ఉంటుంద‌న్న గ‌ణేశ్ ను టార్గెట్ చేశారు. నిజానికి అత‌డు ఎలిమినేట్ అయ్యేంత‌గా ఏమీ చికాకు పెట్టించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ.. ఎలిమినేష‌న్ నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో అంద‌రూ క‌లిసి కామ‌న్ మ్యాన్ ను టార్గెట్ చేయ‌టం గ‌మ‌నార్హం.

తాజా ఎపిసోడ్‌లో కామ‌న్ మ్యాన్ గ‌ణేశ్ ను ఎలిమినేష‌న్ కు నామినేట్ చేశారు. బాబు గోగినేని.. త‌నీష్.. శ్యామ‌ల‌.. దీప్తి సునైనా.. తేజ‌స్వినీ.. అమిత్ లు కామ‌న్ మ్యాన్ ను ఎలిమినేష‌న్ కు నామినేట్ చేశారు. అయితే.. హౌస్ లో చిన్న‌వాడన్న కార‌ణాన్ని చూపించ‌టం.. అత‌ను ఉండ‌లేక‌పోతున్నాడ‌ని.. అత‌ని బాధ‌ను చూడ‌లేక‌పోవ‌టంతోనే తాము నామినేట్ చేస్తున్న‌ట్లుగా కార‌ణాలు చెబుతున్నారు.

త‌న గొంతు నొక్కుతున్నార‌ని.. మాట్లాడ‌కు అంటూ అడ్డుకుంటున్నార‌ని గ‌ణేశ్ త‌న ఎలిమినేష‌న్ నామినేట్ చేసే స‌మ‌యంలో చెప్పాడు. సెల‌బ్రిటీల‌న్న బెరకు గ‌ణేశ్ లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మ‌రి.. ఈ వారం గ‌ణేష్ ఎలిమినేట్ అవుతారా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఒక‌వేళ‌.. గ‌డిచిన రెండు వారాలుగా కామ‌న్ మ్యాన్ టార్గెట్ అయిన‌ట్లే.. ఈసారి గ‌ణేశ్ ఎలిమినేట్ అయితే మాత్రం బిగ్ బాస్ కు కామ‌న్ మ్యాన్ అంటే ఇష్ట‌ముండ‌ద‌న్న విమ‌ర్శ చుట్టుకోవ‌టం ఖాయ‌మ‌న్న అభిప్రాయం బ‌లంగా వినిపిస్తోంది. ఏమైనా జ‌ర‌గొచ్చ‌న్న మాట‌కు త‌గ్గ‌ట్లే.. ఏమైనా జ‌ర‌గొచ్చు. వీకెండ్ వ‌ర‌కూ వెయిట్ చేస్తే స‌రి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు