రాజమౌళి అంతటోడికి కూడా భయం పట్టుకుంది

రాజమౌళి అంతటోడికి కూడా భయం పట్టుకుంది

రాజమౌళి వల్ల కాకపోతే ఇంకెవరి వల్ల కాదనేంతగా తెలుగు చిత్ర సీమ స్థాయిని పెంచేసిన దర్శకుడయి వుండీ తదుపరి చిత్రం విషయంలో చాలా భయపడుతున్నాడు. బాహుబలి తీసిన దర్శకుడు అనే పేరు, గౌరవంతో ప్రస్తుతం రాజమౌళిని ఎవరూ ప్రశ్నించడం లేదు. మల్టీస్టారర్‌ తీస్తానంటూ ఎన్టీఆర్‌, చరణ్‌లని అడిగితే కథ కూడా వినకుండా ఓకే చెప్పేసారు.

ఇద్దరు స్టార్‌ హీరోలతో మల్టీస్టారర్‌ చేసేస్తే బాహుబలి తర్వాత వచ్చే చిత్రానికి కావాల్సిన అర్హత చాలని రాజమౌళి భావించాడు. అయితే ఇతర భాషల్లో తనకి వచ్చిన గుర్తింపు రీత్యా ఇది అల్లాటప్పా మల్టీస్టారర్‌ కాకూడదు. తెలుగు హీరోలతో రెగ్యులర్‌ సినిమా తీస్తే పర భాషల్లో ఆదరణ వుండదు కనుక మళ్లీ గ్రాఫిక్స్‌ ప్రధానమైన కథ కావాల్సి వచ్చింది. బాహుబలి తర్వాత వచ్చే సినిమాతో కూడా నిరాశ పరచకూడదనే టెన్షన్‌తో రాజమౌళి ప్రస్తుతం అయోమయానికి లోనవుతున్నాడు.

ఇంతవరకు కథ కూడా ఓకే కాలేదు. ఏ సినిమా విషయంలో అయినా చాలా క్లారిటీతో వుండే రాజమౌళి ఇప్పుడు దీనికి పడుతోన్న టెన్షన్‌ చూసి సన్నిహితులే షాకవుతున్నారు. ఆగస్టులో పని మొదలవుతుందని అనుకున్న మల్టీస్టారర్‌ డిసెంబర్‌కి గానీ సెట్స్‌ మీదకి వెళ్లదనేది లేటెస్ట్‌ అప్‌డేట్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు