నితిన్‌ సొంత కొట్టు కట్టేసినట్టే

నితిన్‌ సొంత కొట్టు కట్టేసినట్టే

అఖిల్‌ సినిమాని నిర్మించి దారుణమైన నష్టాలు చవిచూసిన నితిన్‌కి ఆ తర్వాత ఛల్‌ మోహన్‌ రంగతో కూడా ఎదురు దెబ్బ తగిలింది. ఇష్క్‌, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాలతో వచ్చిన లాభాలతో పాటు గుడ్‌విల్‌ కూడా ఆ తర్వాతి చిత్రాలతో పోయింది. దీంతో సొంత కుంపటి పక్కన పెట్టి వేరే నిర్మాతలకి డేట్స్‌ ఇచ్చి సక్సెస్‌ భారం వారి నెత్తినే పెట్టేస్తున్నాడు.

దిల్‌ రాజుతో చేస్తోన్న శ్రీనివాస కళ్యాణం మళ్లీ తనని ట్రాక్‌లో పెడుతుందని నమ్ముతున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి, మైత్రి మూవీ మేకర్స్‌కి కూడా నితిన్‌ డేట్స్‌ ఇచ్చాడు. సొంతంగా సినిమాలు చేస్తే లాభాలు రాకపోగా, తన పారితోషికం కూడా రాకుండా పోతుందని నితిన్‌ రియలైజ్‌ అయ్యాడు. అందుకే సినిమాకి మూడు నుంచి అయిదు కోట్ల రేంజిలో వసూలు చేస్తూ సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నాడు.

అఖిల్‌, ఛల్‌ మోహన్‌ రంగ చిత్రాలకి జరిగిన నష్టం నుంచి నితిన్‌ ఫ్యామిలీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనంటున్నారు. కెరియర్‌ డౌన్‌లో వుండడంతో నితిన్‌ ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనలు కూడా చేయడం లేదు. ఇష్క్‌తో అయినట్టుగా మళ్లి ఒక్కసారి మళ్లీ బౌన్స్‌ బ్యాక్‌ అయితే అప్పుడు కళ్యాణం గురించి ఆలోచిస్తాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు