అవుట్‌డేటెడ్‌ లవ్వు... పనవుద్దా?

అవుట్‌డేటెడ్‌ లవ్వు... పనవుద్దా?

సాయి ధరమ్‌ తేజ్‌ ప్రతి సినిమాలోను ఫైట్లు చేసి చేసీ బోర్‌ ఫీలయి లవ్‌స్టోరీ చేయడంతోనే ఫ్రెష్‌గా ఫీలవుతున్నాడేమో కానీ 'తేజ్‌ ఐ లవ్యూ'ని చూస్తే ఈ తరం ప్రేక్షకులకి నచ్చే ప్రేమకథలా కనిపించడం లేదు. కరుణాకరన్‌ ఐడియాలు ఏనాడో అవుట్‌డేటెడ్‌ అయిపోయాయి. ఒకమ్మాయి వెంట పడి తర్వాత పట్టించుకోవడం మానేస్తే మన గురించి ఆలోచిస్తారంటూ తొంభైల కాలం నాటి ఐడియాలతో తేజ్‌ ట్రెయిలర్‌తో కరుణాకరన్‌ గాలి తీసేసాడు.

ఇందులోని జోకులు, డైలాగులు అన్నీ కూడా ఇరవయ్యేళ్ల నాటి ప్రేమకథని చూస్తోన్న భావనే కలిగించాయి. అయితే సాయి ధరమ్‌ తేజ్‌ మాత్రం ఈ చిత్రాన్ని బలంగా నమ్మినట్టున్నాడు. చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. అతని పక్కన అనుపమ కూడా అందంగా వుంది. ఆడియో అయితే పెద్దగా ఎక్కలేదు.

కరుణాకరన్‌ మార్కు స్వీట్‌ లవ్‌స్టోరీని ఇప్పటి తరం ఎంజాయ్‌ చేస్తారని నిర్మాత కె.ఎస్‌. రామారావు విశ్వసిస్తున్నారు. టీజర్‌ వరకు చాలా కొత్తగా అనిపించిన సినిమానే ట్రెయిలర్‌ వచ్చాక చాలా రొటీన్‌ అనిపించేసింది. మరి సినిమాలో ఏదైనా కొత్త అంశం వుందో లేదో కానీ అచ్చంగా తొలిప్రేమ మార్కు సినిమాని ఇప్పుడు తీస్తానంటే మాత్రం అసలే ఫ్లాపుల్లో వున్న సాయిధరమ్‌తేజ్‌కి అది మరింత పెద్ద మైసస్‌ అయిపోయే ప్రమాదముంది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English