చిన్న కూతురి కోసం చిరంజీవి దిగారు

చిన్న కూతురి కోసం చిరంజీవి దిగారు

చిరంజీవికి చిన్న కూతురు శ్రీజ అంటే ఎంత ఇష్టమనేది అందరికీ తెలిసిన విషయమే. సోదరుడు చరణ్‌ హీరో అయితే, సోదరి సుప్రియ స్టయిలిస్ట్‌గా బిజీ అయితే సినిమాలతో ఏ సంబంధం లేకుండా వుండిపోయింది శ్రీజ మాత్రమే. అయితే తనకి లైమ్‌ లైట్‌లో వుండాలని, తన కుటుంబంలోని మిగతావారిలా టాలెంటెడ్‌ అనిపించుకోవాలని చాలా కోరిక అట.

అది కుదరకపోవడంతో తన భర్తని హీరోగా చూసుకుని ఆ ముచ్చట తీర్చుకుందామని భావించింది. కళ్యాణ్‌దేవ్‌కి కూడా ఆ కోరిక వుండడంతో చిరంజీవికి రిక్వెస్ట్‌ పెట్టుకున్నారు. మొత్తానికి కళ్యాణ్‌దేవ్‌ తొలి సినిమా వారాహిలో సెట్‌ అయింది. త్వరలోనే విడుదలకి సిద్ధమవుతోన్న విజేత ఆడియో వేడుకకి వచ్చి చిరంజీవి ఆశీస్సులు కూడా అందించారు.

అంతటితో ఆగకుండా ఈ చిత్రం ఫైనల్‌ ఎడిట్‌ని చిరంజీవి ఫైనలైజ్‌ చేస్తున్నారట. తనకున్న అపార అనుభవంతో ఏది వుంచితే జనం ఆమోదిస్తారనేది చిరంజీవి చెబుతోంటే అందుకు అనుగుణంగా ఎడిటింగ్‌ జరుగుతోందట. అల్లుడిని సక్సెస్‌ చేసి తద్వారా చిన్న కూతురి కళ్లల్లో ఆనందం చూసేందుకు చిరంజీవి తన పనులు పక్కన పెట్టి మరీ విజేత చిత్రం కోసం సమయం కేటాయిస్తున్నారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English