విలన్‌ వేషాలు ఇవ్వట్లేదని...

విలన్‌ వేషాలు ఇవ్వట్లేదని...

హీరోగా సక్సెస్‌ లేకపోవడంతో విలన్‌ క్యారెక్టర్లు చేయడానికి సిద్ధమంటూ సుమంత్‌ చాలా కాలం క్రితమే ప్రకటించాడు. మిగతా వారి మాట అలా వుంచితే కనీసం అక్కినేని కాంపౌండ్‌లో వారు కూడా సుమంత్‌కి విలన్‌ క్యారెక్టర్లు ఇవ్వడం లేదు. తనకి క్లాస్‌ హీరోగా, సాఫ్ట్‌ హీరోగా ముద్ర వుండడంతో తనలో విలన్‌ని చూడలేకపోతున్నారని సుమంత్‌ గ్రహించాడు.

అందుకే తనలో విలన్‌ పాత్ర చేసే లక్షణాలు పుష్కలంగా వున్నాయని చూపించడానికి అతను 'ఇదం జగత్‌' చేస్తున్నాడు. ఇందులో సుమంత్‌ హీరో అయినా కానీ అతని పాత్ర నెగెటివ్‌ షేడ్స్‌తో వుంటుంది. సంఘ విద్రోహ చర్యలకి పాల్పడే స్వార్ధపరుడిగా సుమంత్‌ కనిపిస్తాడట. ఈ చిత్రంతో తనలోని విలన్‌ని తెలుగు చిత్ర పరిశ్రమ గుర్తిస్తుందని, ఇక మీదట తనకి విలన్‌ పాత్రలు పెద్ద సినిమాల్లోను ఆఫర్‌ చేస్తారని సుమంత్‌ ఆశిస్తున్నాడు.

మిగిలిన హీరోలు ఎలా వున్నా కానీ నాగ చైతన్య, అఖిల్‌ అక్కినేని లాంటి వారు కనుక సుమంత్‌ని విలన్‌గా ప్రమోట్‌ చేస్తే ఆ తర్వాత నెమ్మదిగా వేరే సినిమాల్లోను నెగెటివ్‌ పాత్రల్లో సెటిల్‌ అవ్వవచ్చు. అయితే ఇదంతా జరగడానికి ముందు ఇదం జగత్‌ చిత్రాన్ని సుమంత్‌ నెగెటివ్‌ పాత్రతో మెప్పించేట్టు చేయాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు