మెగా హీరోకి భయం పట్టుకుంది

మెగా హీరోకి భయం పట్టుకుంది

అసలే ఫ్లాపుల్లో వున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌కి మరోసారి సోలో రిలీజ్‌ దొరకడం లేదు. మెగా అల్లుడు కళ్యాణ్‌దేవ్‌ 'విజేత'తో క్లాష్‌ తప్పించుకున్నా, మాస్‌ హీరో గోపిచంద్‌ 'పంతం' వీడడం లేదు. పంతం చిత్రాన్ని ముందుగానే జులై 5న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. జూన్‌ 29న విడుదల చేద్దామని అనుకున్న 'తేజ్‌'ని సెంటిమెంట్‌ కారణాల రీత్యా జులై 6కి మార్చారు.

వీరు రావడంతో 'పంతం' చిత్రం వాయిదా పడుతుందని భావించారు కానీ అది జరగడం లేదు. వాళ్లు మరుసటి వారానికి వెళతారని ఆశ పడుతూ వుండగానే ట్రెయిలర్‌లో కూడా జులై 5న విడుదల చేస్తున్నట్టు ప్రకటించేసారు. పంతం, తేజ్‌ రెండూ విభిన్నమైన చిత్రాలయినా కానీ గోపిచంద్‌ చిత్రం బాగుందనే టాక్‌ వస్తే మాత్రం తర్వాతి రోజు రాబోయే తేజ్‌పై ఎఫెక్ట్‌ వుంటుంది.

అందులోను ఇది పూర్తిగా క్లాస్‌ చిత్రం కావడం, సాయి ధరమ్‌ తేజ్‌కి ప్రధానంగా మాస్‌ మార్కెట్‌ వుండడంతో తేజ్‌ ఒకింత రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే. ఏ సినిమాతోను పోటీ లేకుండా సేఫ్‌గా విడుదల చేసుకోవాలని చూసినా కానీ పంతంతో తలపడక తప్పడం లేదు. ఈ చిత్రం తమ సినిమాకి ఎంత డ్యామేజ్‌ చేస్తుందో అనే కంగారు తేజ్‌ బృందంలో నెలకొందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరోవైపు తేజ్‌ వల్ల పంతం చిత్రానికీ ఇబ్బంది వుంటుంది. ఈమధ్య కాలంలో వరుస పరాజయాలు చవిచూసిన గోపిచంద్‌కి ఈ చిత్ర విజయం చాలా కీలకం. మరి ఈ పంతంలో విజయం ఎవరిదనేది మరో పది రోజుల్లో తేలిపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు