రాజమౌళి చిరుకు ఏసేశాడు

రాజమౌళి చిరుకు ఏసేశాడు

రాజమౌళి గొప్ప దర్శకుడే కాదు.. మంచి వక్త కూడా. కార్యక్రమం ఏదైనా చాలా ఆసక్తికరంగా మాట్లాడి అందరినీ మెప్పిస్తాడు జక్కన్న. తాజాగా ‘విజేత’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లోనూ జక్కన్న తనదైన శైలిలో ప్రసంగించాడు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన చిరును ఉద్దేశించి రాజమౌళి గొప్పగా మాట్లాడాడు. చిరంజీవి జడ్జిమెంట్ స్కిల్ ఎలాంటిదో జక్కన్న వివరించాడు.

చిరంజీవి బాగా నటిస్తాడని.. డ్యాన్సులు బాగా చేస్తాడని.. ఇంకా అనేక రకాలుగా ప్రతిభ చూపిస్తాడని అందరికీ తెలిసిన విషయమే అని.. కానీ ప్రేక్షకులకు తెలియనిది, ఇండస్ట్రీ జనాలకు మాత్రమే తెలిసింది మరొక టాలెంట్ ఆయనలో ఉందని.. అదే ఆయన జడ్జిమెంట్ స్కిల్ అని రాజమౌళి చెప్పాడు. ఒక కథ విని.. అది వర్కవుటవుతుందో లేదో చిరు ఈజీగా చెప్పేస్తాడని.. మార్పులు చేర్పులు చెప్పి ఆ కథ మరింత బాగా రావడానికి తోడ్పడతారని.. ఈ విషయంలో ఆయన్ని మించిన వాడు ఇండస్ట్రీలోనే లేడని జక్కన్న తీర్పిచ్చేశాడు.

తాను కూడా ‘మగధీర’ కథను ముందుగా చిరంజీవికే చెప్పానని.. ఆయన ఓకే అన్నాక చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందని.. అలా చిరు నుంచి ఆమోద ముద్ర వస్తే ఎవరికైనా ఉత్సాహం వస్తుందని రాజమౌళి తెలిపాడు. ‘విజేత’ కథను కూడా చిరు ఓకే చేశాడు కాబట్టి కచ్చితంగా సినిమా బాగుంటుందని.. సాయి కొర్రపాటి చిన్న, పెద్ద అని తేడా లేకుండా దేనికైనా బాగా ఖర్చు పెడతాడని.. ‘విజేత’ను ముందు చిన్న సినిమా అనే చెప్పారని.. కానీ సెంథిల్ కుమార్‌ను ఛాయాగ్రాహకుడిగా పెట్టుకోవడంతోనే ఈ సినిమా రేంజేంటో తనకు అర్థమైందని.. ఈ చిత్ర ట్రైలర్ చాలా బాగుందని.. సినిమా కూడా బాగుంటుందని ఆశిస్తున్నానని అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English