మెగా హీరోల క్లాష్... చిరు భయం

మెగా హీరోల క్లాష్... చిరు భయం

మెగా ఫ్యామిలీలో అరడజను మందికి పైగా యాక్టివ్‌గా ఉన్న హీరోలున్నారు. దీంతో ఒకరితో ఒకరికి క్లాష్ రాకుండా వాళ్ల సినిమాలను షెడ్యూల్ చేయడం కష్టమైపోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ పరిస్థితి నివారించలేక సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ సినిమాల్ని ఒకే వారాంతంలో రిలీజ్ చేశారు. వాటిలో ‘తొలి ప్రేమ’ సూపర్ హిట్టయితే.. ‘ఇంటిలిజెంట్’ అడ్రస్ లేకుండా పోయింది.

దీంతో ఈ క్లాష్‌ను నెగెటివ్ సెంటిమెంటుగా భావించి ఇకపై అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని అనుకుంది మెగా ఫ్యామిలీ. ఐతే మెగా ఫ్యామిలీకి బాగా కలిసొస్తుందని పేరున్న జులై నెలలో ఒకే వీకెండ్లో ఇద్దరు మెగా హీరోల సినిమాలు పోటీకి సిద్ధమయ్యాయి. ఈ విషయంలో చిరంజీవి సైతం కొంత ఆందోళనకు లోనయ్యాడట. ఐతే ఆయన జోక్యం చేసుకున్నారో లేదో కానీ.. ఈ పోటీని నివారించగలిగారు.

మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సినిమా ‘తేజ్ ఐ లవ్యూ’ జులై 6న విడుదల కాబోతుండగా.. అదే తేదీకి అనుకున్న చిరు అల్లుడు కళ్యాణ్ దేవ్ చిత్రం ‘విజేత’ను వాయిదా వేశారు. ఆ చిత్ర వడుదల తేదీని 12వ తేదీకి మార్చుకున్నాడు నిర్మాత సాయి కొర్రపాటి. ఈ విషయాన్ని ‘విజేత’ ప్రి రిలీజ్ ఈవెంట్లో చిరునే స్వయంగా వెల్లడించాడు. మేనల్లుడు.. అల్లుడి సినిమాలు ఒకే తేదీకి వస్తాయేమో.. ఎలా అని తాను కొంచెం టెన్షన్ పడ్డానని.. కానీ ఇలాంటి పోటీ వద్దని భావించి సాయి కొర్రపాటి పెద్ద మనసుతో తన సినిమా రిలీజ్ డేట్ మార్చుకున్నారని చెప్పాడు చిరు.

ఈ సంగతి వెల్లడిస్తూ 12న ‘విజేత’ వస్తుందన్న విషయాన్ని ఆయన ప్రకటించారు. కొత్త దర్శకుడు రాకేశ్ శశి రూపొందించిన ‘విజేత’లో కళ్యాణ్ దేవ్ సరసన మాళవిక కథానాయికగా నటించింది. మురళీశర్మ కీలక పాత్రలో నటించాడు. ‘బాహుబలి’ కెమెరామన్ సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందించగా.. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English