వరసగా నాలుగు.. భలే సెట్ చేసుకున్నాడు

వరసగా నాలుగు.. భలే సెట్ చేసుకున్నాడు

గత ఏడాది వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన రెండవ బ్లాక్ బస్టర్ సినిమా. అయితే ఆ సినిమా తరువాత విజయ్ క్రేజ్ పెరిగింది గాని డైరెక్ట్ సినిమా ఒక్కటి కూడా రాలేదు.

ఏ మంత్రం వేసావే అనే సినిమా వచ్చినా దాన్ని ఎప్పుడో ఒకే చేయడంతో అవుట్ పుట్ బాగా రాలేదని విజయ్ పట్టించుకోలేదు. ఆ సినిమా వచ్చినట్టు వెళ్లినట్లు కూడా చాలా మందికి తెలియదు. ఇక మహానటి సినిమా అంటే అందులో ఎదో అలా కనిపించాడు అనే చెప్పాలి. అయితే ఇప్పుడు విజయ్  నాలుగు సినిమాలతో దండయాత్ర చేయబోతున్నాడు. ఆ సినిమాలన్నీ మనోడి రేంజ్ కి తగ్గట్టుగానే యూత్ ఫుల్ గా తెరకెక్కుతున్నాయి.

ముందుగా టాక్సీవాలా సినిమాతో విజయ్ తన బాక్స్ ఆఫీస్ బొనాంజా ని మొదలు పెట్టనున్నాడు. ఆ సినిమా హారర్ అండ్ కామెడీ కాన్సెప్ట్ తో రానుంది. ఇక ఆ తరువాత మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ లో చేస్తూన్న గీత గోవిందం సినిమా దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. టాక్సీ వాలా తో పాటు ఆ సినిమా కూడా ఒక నెల గ్యాప్ లోనే వచ్చే అవకాశం ఉంది. ఇక డియర్ కామ్రేడ్ అనే డిఫరెంట్ జానర్ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఇక నోటా అంటూ ఓటు గుర్తుకు సంబంధించిన విషయాన్ని సినిమా ద్వారా చెప్పాలని అనుకుంటున్నాడు.

మొత్తంగా నాలుగు డిఫరెంట్ సినిమాలతో ఈ హైదరాబాద్ కుర్రాడు భలే సెట్ చేసుకున్నాడు. మరి అర్జున్ రెడ్డి స్థాయిలో విజయాల్ని అందుకుంటాడో లేదో చూడాలి. అయితే ఇదే రేంజులో ఉన్న మిగతా హీరోలు మాత్రం.. ఇలా వరుస సినిమాలు చేయట్లేదు. ఒకసారి చూసుకోండి బాస్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు